Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఇ-కామర్స్ వేదిక మింత్రాతో లండన్ కేంద్రంగా కలిగిన డిజిటల్ ఫ్యాషన్ బ్రాండ్ అర్బానిక్ భాగస్వామ్యం కుదర్చుకుంది. ఇది ఆన్లైన్ విక్రయ సంస్థతో అర్బానిక్ చేసుకున్న తొలి ఒప్పందమని మింత్రా పేర్కొంది. పలు దేశాలలో తమ ట్రెండీ, స్టైలిష్ ఫ్యాషన్లను విభిన్న విభాగాల వ్యాప్తంగా అందించడానికి ఇది దోహదం చేయనుందని పేర్కొంది. మింత్రాపై దాదాపు 2000కు పైగా శైలిలతో కూడిన వైవిధ్యమైన కలెక్షన్ను అర్బానిక్ అందించనుందని తెలిపింది.