Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ హెటెరో ఆవిష్కరించిన టోసిలిజుమాబ్ (టోసిరా) జెనరిక్ ఔషధాన్ని భారత్లో పరిమిత స్థాయిలో అత్యవసర వినియోగ అనుమతి (ఇయుఎ)కి డిసిజిఐ అనుమతించింది. కరోనా కారణంగా ఆస్పత్రి పాలై చికిత్సలో భాగంగా సిస్టమిక్ కోర్టికోస్టెరాయిడ్స్, అదనపు ఆక్సిజన్, నాన్ ఇన్వాసివ్ లేదా ఇన్వాసివ్ మెకానికల్ వెంటిలేషన్ లేదా ఎక్స్ట్రాకార్పొరియల్ మెంబ్రెన్ ఆక్సిజినేషన్ (ఎక్మో) పొందుతున్న యుక్త వయస్సు వారికి ఈ జెనరిక్ ఔషధాన్ని చికిత్సలో భాగం చేయడానికి వీలుదక్కనుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొరత ఉన్న టోసిలిజుమాబ్ను భారత్లో సరఫరా చేసేందుకు ఈ అనుమతులు తమకు ఎంతో ముఖ్యమైనవని, ప్రభుత్వంతో కలిసి సన్నిహితంగా పనిచేస్తూ సరైన రీతిలో సరఫరా చేసేందుకు కషి చేస్తున్నామని హెటిరో గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ బి పార్థసారథిరెడ్డి తెలిపారు