Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : విదేశీ స్టాక్స్ల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు ఆర్జించడానికి వీలుందని దేశంలోని ప్రయివేటు బ్యాంకర్ల సూచిస్తున్నారు. భారత్లోని సంపన్న ఇన్వెస్టర్లు ప్రపంచంలోని ఇతర భాగాల్లోని మార్కెట్లపై దృష్టి సారించడం ద్వారా అధిక రాబడులను పొందే వీలుందని కొటాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్ సిఇఒ శ్రీకాంత్ సుబ్రమణ్యయన్ పేర్కొన్నారు. గడిచిన 15-18 మాసాల్లో తాము విదేశీ ఈక్వీటిలపై కేటాయించిన మొత్తంపై నాలుగు రెట్ల లాభాలు వచ్చాయన్నారు.