Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రస్తుత ఏడాది ఆగస్టులో భారత పసిడి దిగుమతులు రెట్టింపై ఐదు మాసాల గరిష్ట స్థాయికి చేరాయి. పసిడి ధరలు తగ్గడంతో డిమాండ్ పెరిగిందని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. మరోవైపు పండుగ సీజన్ నేపథ్యంలో కొనుగోళ్లు పెరిగాయన్నారు. గడిచిన ఆగస్టులో బంగారం దిగుమతులు 121 టన్నులుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే మాసంలో 63 టన్నుల దిగుమతి చోటు చేసుకుంది. ఇదే సమయంలో విలువ పరంగా 3.7 బిలియన్ డాలర్లు కాగా.. గడిచిన ఆగస్టులో 6.7 బిలియన్ డాలర్లుగా ఉంది. సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై ధర 71 తగ్గి రూ.46,503గా నమోదయ్యిందని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ తెలిపింది. కిలో వెండిపై రూ.263 పెరిగి రూ.64,168 వద్ద ముగిసింది.