Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐటీ సేవల సంస్థ అనలెక్ట్ ఇండియా హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరుల్లో కార్యాలయాలు ఉండగా తాజాగా తన మూడో ఆఫీస్‌ను రాష్ట్ర రాజధానిలో ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఈ మూడు సెంటర్లలో 800 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా టెక్నాలజీ, మీడియా సర్వీసులు, మార్కెటింగ్ సైన్సెస్, క్రియేటివ్ సర్వీసెస్ లాంటి రంగాల్లో తమ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను విస్తరించే వ్యూహంలో భాగంగా 2021 డిసెంబర్ నాటికి విస్తతంగా మానవనరులను నియమించుకోనున్నట్టు అనలెక్ట్ ఇండియా అధ్యక్షుడు విశాల్ శ్రీవాస్తవ తెలిపారు.