Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వొడాఫోన్ ఐడియా ఛైర్పర్సన్
న్యూఢిల్లీ : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమ సంస్థకు ప్రభుత్వ మద్దతు లభిస్తుందని భావిస్తున్నామని వొడాఫోన్ ఐడియా (వీఐ) ఛైర్పర్సన్ హిమాన్షు కపానియా పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన వాటాదారులకు లేఖ రాశారు. ఏజీఆర్ బకాయిల రద్దుకు సుప్రీం నిరాకరించడంతో కుమార మంగళం బిర్లా రాజీనామా చేయడంతో ఆగస్టు 4న కపానియా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక ఒత్తిడితో ఉన్న పరిశ్రమ నిలదొక్కుకునేలా లేదన్నారు. రుణదాతలకు వీఐ రూ.23,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. స్పెక్ట్రమ్, వాయిదా పడిన ఏజీఆర్ బకాయిల రూపేణా ప్రభుత్వానికి రూ.1,68,190 కోట్ల చెల్లించాల్సి ఉంది. గత 12 త్రైమాసికాల నుంచి వీఐ పెద్ద ఎత్తున నష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. 2021 జూన్ 30 నాటికి అన్ని బకాయిలు కలుపుకుని రూ.2 లక్షల కోట్లు దాటిపోయాయి. వీటికితోడు ఏఆర్పీయూ స్థాయిపై ఒత్తిళ్ల వల్ల ఆదాయాలు, లాభాలు పెరగని పరిస్థితుల్లో కంపెనీ ఉందని ఇక్రా గ్రూపు హెడ్ సవ్యసాచి ముజుందార్ తెలిపారు.