Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) సామాజిక సేవ దృక్పతాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కార్పొరేట్ సామాజిక సేవ (సిఎస్ఆర్) కార్యక్రమాల్లో ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి పాల్గొన్నారు. గద్వాల్ జిల్లా చింతల్‌పేట్ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ.12 లక్షలతో కంప్యూటర్ ల్యాబ్, ప్రొజెక్టర్ రూమ్, సైన్స్ ల్యాబ్, ఫర్నీచర్‌ను అందజేశారు. గచ్చిబౌలిలోని కాజాగూడలోని స్పార్స్ హాస్పిసి సెంటర్‌కు రూ.50 లక్షల విలువ చేసే 80 పడకలను అందించారు. హయత్న గర్లోఇ సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్‌కు రూ.7.50 లక్షల విలువ చేసే మారుతి 7 సీట్ల వాహనం, గ్రౌండర్, స్టేషనరీ, హైజిన్ ఉత్పత్తులకు సాయం చేశారు. శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి సిఎస్ఆర్ మద్దతును అందించి వారికి అర్థవంతమైన జీవితాన్ని ఇవ్వడమే ఎస్బిఐ సిఎస్ఆర్ విధానమని శెట్టి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.2 కోట్లు వ్యయం చేశామని.. మార్చి కల్లా దీన్ని రూ.10 కోట్లకు చేర్చనున్నామని చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రన్ తెలిపారు.