Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మీరు గనుక శాస్త్రీస్ లాంటి కుటుంబాన్ని కలిగిఉంటే, ఇక అంతా సందడే సందడి. ‘అంతా కలసి తినే కుటుంబం, కలసి ఉండే కుటుంబం’ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న సోనీ లివ్ యొక్క సరదాగా సాగే డ్రామా సిరీస్ ‘పోట్లక్’. ఇది కాస్తంత మ్యాడ్ నెస్, మరెంతో ప్రేమతో కూడిన భావోద్వేగాల సంగమం. శాస్త్రి పోట్లక్ ను నిర్వహించినప్పుడు, యావత్ కుటుంబం అక్కడికి చేరుకునే కుటుంబ అనుబంధాలను పండించినప్పుడు చోటు చేసుకునే వినోదాన్ని మీరు ఆనందించవచ్చు. రాజశ్రీ ఓజా దర్శకత్వం వహించిన పోట్లక్, సోనీ లివ్ పై మాత్రమే 2021 సెప్టెంబర్ 10న ప్రారంభం కానుంది. గత ఏడాదిన్నర కాలంగా ఆ కుటుంబం ప్రేమకు అంతం లేని విధంగా ఉంది. మనమంతా కూడా మనం అభిమానించే వారితో కలసి ఉండేందుకు ప్రయత్నించే ప్రపంచంలో పోట్లక్ అనేది అలాంటి వారి మధ్య, మరీ ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో ఉండే అంతర్ సంబంధాలను, ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తిని కళ్లకు కట్టినట్లుగా చూపెడుతుంది. ఆధునిక భారతీయ కుటుంబం తీరుతెన్నులను అనుసరిస్తూ ఈ షో అటు పాత తరం అంచనాలను ఇటు నవతరం యొక్క భావవ్యక్తీకరణ స్వేచ్ఛనూ మిళితం చేస్తుంది. పోట్లక్ దాని ఆసక్తిదాయక కథనంతో, పాత్రలతో వీక్షకులను అలరిస్తుంది.
మీరే గనుక విభిన్న మనస్తత్వాలతో కూడిన కుటుంబాన్ని కలిగి అంతా ఒకే ఇంట్లో కలసి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది మీకు చక్కటి ప్రేమను, అన్ని రకాల కష్టాల్లోనూ కలసి ఉండడంలోని మాధు ర్యాన్ని అందిస్తుంది. ట్రిపుల్ కామ్ మీడియా, లూస్ కనాన్స్ కంటెంట్ స్టూడియో &వయల్ కంటెంట్అందిస్తున్న పోట్లక్ కునా ల్ దాస్ గుప్తా, పావ్ నీత్ గాకల్, గౌరవ్ లుల్లా, వివేక్ గుప్తాలచే నిర్మించబడింది. అశ్విన్ లక్ష్మి నారాయ ణ్, భరత్ మిశ్రా, గౌరవ్ లుల్లా కథను అందించారు. సైరస్ సాహుకార్, హర్మన్ సింఘా, ఐరా దుబే, జతిన్ సియల్, కిటు గిద్వానీ, శిఖా తల్సానియా, సలోని పటేల్, సిద్ధాంత్ కార్నిక్ తదితరులు ఇందులో నటించారు.
ఈ షో టైటిల్ ట్రాక్ ను అమిత్ మిశ్రా, కామాక్షి రాయ్ ఆలపించారు. సచిన్-సుఖ్ అమ్రిత్ సంగీతం సమ కూర్చారు. చక్కటి పాటకు సుఖ్ అమ్రిత్ సోయిన్ అక్షర రూపం ఇచ్చారు. ఇది తమిళం, తెలుగు, మల యాళం, కన్నడలోకి డబ్ చేయబడింది.
వ్యాఖ్యలు:
ఆశిశ్ గోవాల్కర్, హెడ్ – కంటెంట్, ఎస్ఇటి, డిజిటల్ బిజినెస్
‘‘చూడదగ్గ, వైవిధ్యభరిత కంటెంట్ ను అందించడం ద్వారా వారికి వినోదం అందించడాన్ని సోనీ లివ్ విశ్వసిస్తుంది. ఇది అందిస్తున్న మరో రిఫ్రెషింగ్ కథనం ‘పోట్లాక్’ ఒక కుటుంబ వినోదాత్మక సిరీస్. ఆధునిక భారతీయ కుటుంబాల్లో ఉండే అంతర్ దృక్పథాలను ఇది వెల్లడిస్తుంది. కుటుంబాలు ఒక్కచోట చేరినప్పుడు రకరకాల భావోద్వేగాలు బయటకు వస్తుంటాయి, వాటిని ఈ షో ఎంతో అందంగా మీకు అందిస్తుంది’’
రాజశ్రీ ఒజా, డైరెక్టర్
‘‘ప్రతి వ్యక్తి జీవితంలో కుటుంబం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. పోట్లాక్ తో ప్రతీ ఒక్కరి సెంటిమెంట్ ను తెలియజెప్పేందుకు మేం ప్రయత్నించాం. శాస్త్రి కుటుంబంలోని ప్రతి పాత్ర కూడా కుటుంబం అంటే ఏ మిటో నిర్వచిస్తుంది, అందుకు అనుగుణంగా నడుచుకుంటుంది. ఈ షో అందరినీ ఒక్కచోటుకు చేరుస్తుం దని, వారు తమ సొంత పోట్లక్ నిర్వహించుకునేలా చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ సంతోషదాయక సమయాల్లో మేమంతా కలసి ప్రయత్నించాం, వీక్షకులకు అత్యుత్తమ ఔషధమైన చిరునవ్వులు అందించా లని. తియ్యదనంతో, స్పైసీగా ఉండే ‘పోట్లాక్’ ను వీక్షకులకు అందించేందుకు సోనీ లివ్ తో కలసిపని చేయడం మాకెంతో ఆనందదాయకం’’.
పవ్ నీత్ గాకల్ అండ్ గౌరవ్ లుల్లా, క్రియేటర్స్ ‘‘కాన్సెప్ట్ పరంగా చూస్తే, పోట్లాక్ అనేది ‘కుటుంబం’ సామాజిక నిర్మాణాన్ని ఓ విభిన్న కోణంలోనుంచి చూపిస్తుంది. ఆధునిక భారతీయ కుటుంబాలు కొన్నేళ్ల నుంచి ఎంతగానో మారుతూ వచ్చాయి. ఈ మార్పులే కేంద్రస్థానంగా ఈ షో ఉంటుంది. ప్రతీ పాత్ర, సందర్భం సమకాలీన కుటుంబ పరిస్థితిని, ఆ ఇంటరాక్షన్స్ ఇటీవలి కాలంలో ఎలా మార్పు చెందాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తీర్చిదిద్దబడింది. ఈ షో కు అర్బన్, కాస్మొపాలిటల్ ఫ్లేవర్ అద్దేందుకు మేం ప్రయత్నించాం. రోజూ తలెత్తే పరిస్థితులను ఒక విశిష్ట రీతిలో కనబరిచాం. ఇందులో కనబరిచే బంధాలన్నీ కూడా వినోదాత్మకంగా, ఆయా సందర్భాలకు తగినట్లుగా ఉంటాయి. పోట్లాక్ ను కుటుంబంతో కలసి ఆనందించే మరెందరినో చేరుకోవాలని మేం కోరుకుంటున్నాం’’.