Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువమంది అభిమానించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, శాంసంగ్ నేడు తమ గెలాక్సీ ఏ52ఎస్ 5జీను భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా అత్యంత శక్తివంతమైన ఆవిష్కరణలను విస్తృత శ్రేణిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తుంది. గెలాక్సీ ఏ52ఎస్ 5జీ, శాంసంగ్ యొక్క గెలాక్సీ ఏ సిరీస్ జాబితాలో రెండవ 5జీ స్మార్ట్‌ఫోన్. ఇది శాంసంగ్ యొక్క 5జీ గ్యారెంటీ అందించడంతో పాటుగా భవిష్యత్‌కు సిద్ధంగా ఉండాలనే కోరిక కలిగిన వినియోగదారులకు అత్యుత్తమ అవకాశంగా నిలుస్తుంది. గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆవిష్కరణలైనటువంటి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్ఫినిటీ–ఓ–డిస్ప్లే, ఓఐఎస్‌తో 64 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా, ఐపీ 67 రేటింగ్‌తో నీరు, ధూళి ప్రతిరోధకతతో వస్తుంది. గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ధర 35,999 రూపాయలుగా 6జీబీ+128జీబీ వేరియంట్‌కు, 37,499 రూపాయలుగా 8జీబీ+128జీబీ వేరియంట్‌కు నిర్ణయించారు. గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 1 ,2021 నుంచి శాంసంగ్ డాట్ కామ్, రిటైల్ స్టోర్లు, సుప్రసిద్ధ ఆన్లైన్ పోర్టల్స్ వద్ద లభ్యమవుతుంది.
‘‘ప్రతి ఒక్కరికీ ఆవిష్కరణలను చేరువ చేయాలనే గెలాక్సీ ఏ సిరీస్ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు భారతదేశంలో గెలాక్సీ ఏ52ఎస్ 5జీను ఆవిష్కరిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాం. ఈ ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, ఈ విభాగంలో అత్యుత్తమమైన ఫీచర్లు అయినటువంటి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఒఐఓస్ ఆధారిత కెమెరా మరియు ఐపీ67 రేటింగ్‌తో పరిపూర్ణమవుతుంది. తద్వారా ఇది గేమింగ్, కంటెంట్ సృష్టి మరియు మరెన్నో వాటికి ఖచ్చితమైన ప్యాకేజీగా నిలుస్తుంది. శాంసంగ్ 5జీ యొక్క గ్యారెంటీ 12 బ్యాండ్స్ మద్దతు, 3 సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌గ్రేడ్స్‌తో వినియోగదారులు 5జీ ప్రయోజనాల అనుభవాలను తొలుత ఆస్వాదించగలరు’’ అని ఆదిత్య బబ్బర్, సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్, మొబైల్ మార్కెటింగ్, శాంసంగ్ ఇండియా అన్నారు.
అద్భుతమైన డిజైన్
గెలాక్సీ ఏ52ఎస్ 5జీలో అద్భుతమైన డిజైన్ ఉంది. ఇది సరళమే అయినప్పటికీ శక్తివంతమైనది. మ్యాటీ బ్యాక్ మరియు హాజ్ ఫినీష్‌తో పాటుగా కనీస కెమెరా ప్రాంగణం వంటివి ప్రీమియం వెనుక వైపు డిజైన్‌లో ఉన్నాయి. గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ఇప్పుడు మూడు ఆకర్షణీయమైన రంగులు– అసమ్ బ్లాక్, అసమ్ వైట్ మరియు అసమ్ వయెలెట్లో లభ్యమవుతుంది. గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ఫోన్లు ఐపీ67 రేటింగ్‌తో వస్తాయి. ఇవి ధూళి, వాటర్ రెసిస్టెంట్ (మంచి నీళ్లలో ఒక మీటరు లోతులో 30 నిమిషాల వరకూ ఉండినా )గా ఉంటుంది.
డిస్ప్లే
గెలాక్సీ ఏ52ఎస్ 5జీలో ప్రకాశవంతమైన మరియు వైవిధ్యమైన సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ –ఓ–డిస్ప్లే ఉంది. ఇది లీనమయ్యే వీక్షణ అనుభవాలను అందిస్తుంది. గెలాక్సీ ఏ52ఎస్ 5జీలో భారీ 6.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ స్ర్కీన్ ఉంది. ఇది కనీస పంచ్ హోల్ కలిగి ఉండడంతో పాటుగా మీ అభిమాన కంటెంట్‌ను సౌకర్యవంతంగా వీక్షించే అవకాశం కల్పిస్తుంది. ఈ విభాగంలో అత్యుత్తమంగా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది కలిగి ఉండటం వల్ల మృదువైన స్ర్కోలింగ్ మరియు గేమింగ్ అనుభవాలను అందిస్తుంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5తో రావడం వల్ల మెరుగైన మన్నికనూ అందిస్తుంది.
పనితీరు
గెలాక్సీ ఏ52ఎస్ 5జీలో శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉంది. ఇది మెరుగైన ప్రాసెసింగ్, గ్రాఫిక్స్ పనితీరును అందిస్తుంది. ఏఐ ఆధారిత గేమ్ బూస్టర్ మరింతగా పనితీరు వృద్ధి చేయడంతో పాటుగా ఫ్రేమ్ బూస్టర్ , ఫ్రేమ్స్ నడుమ వర్ట్యువల్ చిత్రాలను జోడించి గ్రాఫిక్స్‌ను మరింత సరళంగా మారుస్తాయి. తద్వారా గెలాక్సీ ఏ52ఎస్ 5జీను గేమింగ్‌కు అత్యంత అనుకూలంగా మారుస్తాయి. మీరు అస్సలు ఆలోచించనవసరం లేకుండానే మీరు ఏదైతే చేయడానికి ఇష్టపడతారో దానిని సౌకర్యవంతంగా చేయవచ్చు. దీనిలో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిలిచి ఉంటుంది. దీనితో పాటుగా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతు సైతం ఉంది. ఇది మీ ఫోన్‌ను 30 నిమిషాలలో 50% చార్జ్ చేస్తుంది.
కెమెరా
గెలాక్సీ ఏ52ఎస్ 5జీలో క్వాడ్ కెమెరా ఉంది. ఇది ఎన్నో ఉత్సాహపూరితమైన, ప్రతిష్టాత్మక, స్ఫూర్తిదాయక ఫీచర్లు ఉన్నాయి. ఇవి వినియోగదారులు తమ సృజనాత్మకతను దాయనవసరం లేక్డు చేస్తాయి. 64 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా లో ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఉంది. ఇది మీరు స్పష్టంగా చిత్రాలు, వీడియోలను ఒడిసి పట్టుకునేందుకు వీలు కల్పించడంతో పాటుగా ప్రమాదవశాత్తు షేక్ అయినా బ్లర్‌ను తప్పిస్తుంది. ఈ ఓఐఎస్ కెమెరాలో సుదీర్ఘమైన షట్టర్ స్పీడ్ ఉండటం వల్ల అతి తక్కువ కాంతి పరిస్ధితులలో కూడా ప్రకాశవంతమైన షాట్స్ తీయవచ్చు. నైట్ మోడ్ , మల్టీ ఫ్రేమ్ ప్రాసెసింగ్‌ను ప్రకాశవంతమైన, స్పష్టమైన చిత్రాల కోసం వినియోగించుకుంటుంది. అలా్ట్ర వైడ్ 12 మెగా పిక్సెల్ కెమెరాలో 123 డిగ్రీ ఫీల్డ్ఆఫ్ వ్యూ ఉంది. ఇది వైడ్ హారిజన్‌లో కూడా ఖచ్చితమైన షాట్‌ను ఒడిసిపట్టేందుకు అనుమతిస్తుంది. దీనిలోని 5 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా మీ క్లోజ్ షాట్స్‌లో అతి సూక్ష్మమైన, అద్భుతమైన డిటైల్స్‌ను సైతం ఒడిసిపట్టేందుకు అనుమతిస్తుంది. ఈ కెమెరా అతి సహజమైన బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌ను కలిగి ఉంటుంది.. ఇది మీ సబ్జెక్ట్‌ను ఐసోలేట్ చేయడంతో పాటుగా వినూత్నంగా వాటిని నిలుపుతాయి. 5మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయడంతో పాటుగా బొకె ఎఫెక్ట్‌తో అద్భుతమైన పోట్రెయిట్స్ను వినియోగదారులు తీసుకునేందుకు అనుమతిస్తుంది. గెలాక్సీ ఏ52ఎస్ 5జీలో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా మీరు అద్భుతమైన సెల్ఫీలను తీసుకునేందుకు సైతం అనుమతిస్తుంది.
గెలాక్సీ ఏ52ఎస్ 5జీలో సింగిల్ టేక్ ఫీచర్ ఉంది. ఇది 10 వైవిధ్యమైన చిత్రాలను ఒడిసిపట్టడం తో పాటుగా వీడియోను సైతం సింగిల్ క్లిక్‌లో తీసేందుకు అనుమతిస్తుంది. సృజనాత్మక మరియు వినూత్నమైన కంటెంట్ కోసం మై ఫిల్టర్, ఏఆర్ ఎమోజీ, ఫన్ మోడ్ వంటివి వినియోగదారులు తమ చిత్రాలను కస్టమైజ్ చేయడంతో పాటుగా తమ సొంత వ్యక్తిగత సృజనను జోడించేందుకు సైతం అనుమతిస్తుంది. గెలాక్సీ ఏ52ఎస్ 5జీ తో సినిమా గ్రేడ్ వీడియోలను సైతం ప్రో వీడియో, 4కె యుహెచ్డీ రికార్డింగ్, 4కె వీడియో స్నాప్ మరియు సూపర్ స్టెడీ వీడియోలతో ఒడిసిపట్టవచ్చు.
అద్భుతమైన 5జీ గ్యారెంటీ
12 బ్యాండ్ల 5జీ మద్దతుతో 3సంవత్సరాల ఓఎస్ అప్‌గ్రేడ్స్‌తో గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ,భవిష్యత్‌కు సిద్ధంగా ఉండాలని కోరుకునే వినియోగదారుల కోసం తీర్చిదిద్దారు. ఒక్కసారి 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే, 5జీ ప్రయోజనాలను ఆస్వాదించే మొట్టమొదటి వినియోగదారులుగా నిలిచే అవకాశాన్ని ఈ ఉపకరణం అందిస్తుంది. సూపర్ ఫాస్ట్ స్పీడ్స్, అలా్ట్ర లో లాటెన్సీ వంటి ఫీచర్లును ఇది కలిగి ఉంది. గెలాక్సీ ఏ52ఎస్ 5జీతో వినియోగదారులు అసాధారణ వేగంతో డౌన్లోడ్స్ ఆస్వాదించడంతో పాటుగా నియర్ జీరో ల్యాగ్ గేమింగ్‌ను సైతం ఆస్వాదించగలరు. వినియోగదారులు తమ అభిమాన కంటెంట్‌ను వర్ట్యువల్‌గా స్ట్రీమ్ చేయడంతో పాటుగా ఎలాంటి బఫరింగ్నూ ఎదుర్కొనరు. అంతేకాదు, అత్యధిక నాణ్యత కలిగిన కంటెంట్‌ను సైతం పంచుకోగలరు.
అద్భుతమైన భద్రత
గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ యొక్క డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ వేదిక శాంసంగ్ నాక్స్ రక్షిస్తుంది. ఇది వ్యక్తిగత సమాచారం మరియు డాటాను వాస్తవ సమయంలో కాపాడుతుంది. ఈ డివైజ్‌ను హార్డ్‌వేర్ చిప్ అప్‌తో నిర్మించారు. ఇది మీ డాటాను ఐసోలేట్ చేయడంతో పాటుగా ఎన్‌క్రిప్ట్ చేస్తూనే సురక్షితమూ చేస్తుంది. మీరు మీ సున్నితమైన సమాచారాన్ని మరియు ఫైల్స్‌ను సెక్యూర్ ఫోల్డర్‌కు తరలించవచ్చు. అందువల్ల ఆధీకృతం కాని వినియోగించకుండా కాపాడుతుంది.
స్టీరియో సౌండ్ డాల్బీ అట్మాస్ ఈ ఆడియో అనుభవాలను మరింత ఉన్నతంగా మారుస్తాయి. సినిమాటిక్ సౌండ్, 3డీ సరౌండ్ సౌండ్ అనుభవాలు వంటివి మీ మూవీ నైట్స్, గేమింగ్ సెషన్స్‌ను మరో దశకు తీసుకువెళ్తాయి.
గెలాక్సీ ఏ52ఎస్ 5జీలో రామ్ ప్లస్ ఉంది. ఇది మీరు వినియోగిస్తున్న యాప్స్ వేగవంతంగా పనిచేసేందుకు తోడ్పడటంతో పాటుగా ఆప్టిమైజ్డ్ మెమరీ విస్తరణతో మరింత సమర్థవంతంగా మల్టీ టాస్క్కూ తోడ్పడుతుంది. పునరాకృతి చేసిన ఒన్ యుఐ 3.0 ఇంటర్ఫేజ్ ను మీ సౌకర్యం కోసం డిజైన్ చేశారు. అందువల్ల మీరు మల్టీపుల్ టాస్క్స్‌ను సింగిల్ స్ర్కీన్‌తో చేయవచ్చు. అదే సమయంలో ఇది వినోదం మరియు సౌకర్యవంతమైన కస్టమైజేషన్ అవకాశాలను ఆహ్లాదకరమైన అనుభవాలతో అందిస్తుంది. గెలాక్సీ ఏ52ఎస్ 5జీ, శాంసంగ్ పే కు మద్దతునందిస్తుంది. ఇది కాంటాక్ట్‌లెస్ డిజిటల్ చెల్లింపులకు తోడ్పాటునందించడం వల్ల వినియోగదారులకు అర్ధవంతమైన ఆవిష్కరణలు తీసుకురావాలనే శాంసంగ్ వాగ్ధానమూ పునరుద్ఘాటిస్తుంది.
మెమరీ వేరియంట్స్, ధర, లభ్యత
గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ధర 35,999 రూపాయలుగా 6జీబీ+128జీబీ వేరియంట్‌కు, 37,499 రూపాయలుగా 8జీబీ+128జీబీ వేరియంట్‌కు నిర్ణయించారు. గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 1 ,2021 నుంచి శాంసంగ్ డాట్ కామ్, రిటైల్ స్టోర్లు, సుప్రసిద్ధ ఆన్లైన్ పోర్టల్స్ వద్ద లభ్యమవుతుంది.
పరిచయ ఆఫర్‌గా, వినియోగదారులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 3000 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందగలరు లేదా మార్పిడి బోనస్‌గా 3వేల రూపాయలను తమ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకున్న ఎడల పొందవచ్చు. వినియోగదారులు ఆకర్షణీయమైన రీతిలో నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లును జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ చార్జీలతో ప్రధానమైన బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ భాగస్వాముల వద్ద పొందవచ్చు.