Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నేషనల్ స్మాల్ ఇండిస్టీస్ కార్పొరేషన్(ఎన్ఎస్సీఐ)తో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా రూపొందించిన పథకాలను అందించడం ద్వారా వారి పోటీతత్వాన్ని వృద్ధి చేస్తున్నది. ఎన్ఎస్ఐసీ నుంచి వచ్చిన రుణ దరఖాస్తులను స్వీకరించి, అర్హత ఆధారంగా రుణాలను బ్యాంకు మంజూరు చేయనున్నది. ఆర్థికవ్యవస్థ పునరుత్తేజానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని బ్యాంక్ కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ రాహుల్ శుక్లా పేర్కొన్నారు.