Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఆగస్టు ఉత్పత్తిలో తగ్గుదల చోటు చేసుకుంది. చిప్‌ల కొరత వల్ల గడిచిన నెలలో 8శాతం ఉత్పత్తికి కోత పెట్టి 1,13,937 యూనిట్లను తయారు చేసింది. గతేడాది ఇదే మాసంలో 1,23,769 యూనిట్లు నమోదు చేసింది. గడిచిన నెలలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొరత వల్ల ఉత్పత్తి తగ్గిందని ఆ కంపెనీ రెగ్యూలేటరీకి సమాచారం ఇచ్చింది. సెమికండక్టర్ల కొరతతో అనుకున్న సమయానికి వాహనాలు రాక డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫాడా హెచ్చరించింది. కరోనా కారణంగా మూతపడిన విద్యాసంస్థలు ఇప్పుడిప్పుడే తెరుస్తుండటంతో ద్విచక్ర వాహనాలకు భవిష్యత్తులో డిమాండ్ ఉండే అవకాశం ఉందని పేర్కొంది.