Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వేదాంత యొక్క వీజీసీబీకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్‌టెక్ ఎఫెక్టివ్ సేఫ్టీ కల్చర్ అవార్డు 2021’ లభించింది. ప్రభావవంతమైన భద్రతా సంస్కృతి పరంగా అసాధారణ విజయాలకుగానూ ఈ అవార్డును అందజేశారు. వేదాంత యొక్క వీజీసీబీ వద్ద విస్తృతశ్రేణి మరియు అత్యుత్తమ శ్రేణి భద్రతా ప్రక్రియలను గ్రీన్‌టెక్ ఫౌండేషన్ అవార్డుల కోసం నిపుణులతో కూడిన బృందం తనిఖీ చేసింది. గ్రీన్‌టెక్ అవార్డుల కోసం ఎన్నో అగ్రశ్రేణి సంస్థలు పోటీపడ్డాయి. అత్యుత్తమ ప్రక్రియలను స్వీకరించిన కార్పోరేట్స్‌కు అవార్డులను సోనామార్గ్ (జె అండ్ కె) వద్ద జరిగిన వేడుకలో అవార్డులను అందజేశారు. వీజీసీబీ బృందాన్ని అభినందించిన శ్రీ సౌవిక్ మజుందార్, సీఈఓ– ఐరన్ అండ్ స్టీల్ సెక్టార్, వేదాంత లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘భద్రత, సస్టెయినబిలిటీ పరంగా అత్యున్నత ప్రమాణాలు అనుసరించడానికి వేదాంత వద్ద మేము కట్టుబడి ఉన్నాము. సేఫ్టీ ఫస్ట్ సంస్కృతిని రూపొందించడం మరియు దానిని పెంపొందించడంతో పాటుగా జీరో హార్మ్, జీరో డిశ్చార్జ్ అనేవి మా అత్యున్నత వ్యాపార ప్రాధాన్యతలుగా చేసుకున్నాం. వీజీసీబీ వద్ద అనుసరిస్తున్న భద్రతా ప్రక్రియలకు ప్రతీకగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు నిలుస్తుంది’’ అని అన్నారు వేదాంత వీజీసీబీని అభినందించిన శ్రీ ఏ సురేంద్రనాథ్, అదనపు అసిస్టెంట్ డైరెక్టర్ (సేఫ్టీ), ఇన్స్పెకరేట్ డాక్ సేఫ్టీ మాట్లాడుతూ ‘‘వేదాంత వీజీసీబీ తో పాటుగా ఇతర సంస్ధలు స్వీకరించిన భద్రతా ప్రక్రియలు ప్రశంసనీయం. జీరో హార్మ్ పై అసాధారణ దృష్టిని కేంద్రీకరిస్తూ సుస్థిర వృద్ధిని చేరుకునే దిశగా వారు చేస్తున్న ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను’’ అని అన్నారు శ్రీ సీ సతీష్‌కుమార్, డిప్యూటీ సీఈవో, వేదాంత వీజీసీబీ మాట్లాడుతూ ‘‘వీజీసీబీ వద్ద అనుసరిస్తున్న విస్తృత శ్రేణి భద్రతా ప్రక్రియలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు లభించడం పట్ల మేము ఆనందంగా ఉన్నాం. వీజీసీబీ వద్ద మేము మా వ్యాపార సిద్ధాంతంలో సస్టెయినబిలిటీ అత్యంత కీలకంగా ఉందని భావిస్తున్నాం మరియు అన్ని వేళలా అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడం మా ప్రాధాన్యత’’ అని అన్నారు.