Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశపు మహోన్నతమైన సాంస్కృతిక వారసత్వం, బయోగ్రఫీ, చారిత్రక పాత్రలతో పాటుగా జానపద కథలను ప్రస్తుత తరపు చిన్నారులకు తెలుపడంతో పాటుగా మన వారసత్వం పట్ల గర్వంగా భావించేలా చేసేందుకు యునిఫార్మ్జంక్షన్ మరియు అమర చిత్ర కథ (ఏసీకె) భాగస్వామ్యం చేసుకున్నాయి. 116 సంవత్సరాల వారసత్వం కలిగిన ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ అరవింద్ మఫత్‌లాల్ గ్రూప్‌లో భాగం యూనిఫార్మ్ జంక్షన్. అమరచిత్ర కథ (ఏసీకె)తో భాగస్వామ్యం వినూత్నమైనది మరియు యూనిఫార్మ్ జంక్షన్‌కు అత్యంత కీలకమైనది. దీనిద్వారా చిన్నారులకు సంస్కృతి ప్రాధాన్యత తెలుపడంతో పాటుగా భారతీయతతో అనుబంధం మరింతగా మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకుంది. భారతీయ సంస్కృతి గురించి తెలియజేయడం తల్లిదండ్రులకు మాత్రమే కాదని, అందరికీ బాధ్యత ఉందని దీని ద్వారా వెల్లడిస్తున్నారు. జాతీయ విద్యా విధానం 2020 అమలులోకి రావడంతో పాటుగా భారతదేశపు కళలు, సంప్రదాయాలు, సాహిత్యం పట్ల కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలంటున్న నేపథ్యంలో ఈ భాగస్వామ్యం జరుగడం విశేషం. ఏసీకెతో ఈ భాగస్వామ్యం గురించి గగన్ జైన్, కో–ఫౌండర్ అండ్ సీఈవో, యూనిఫార్మ్ జంక్షన్ మాట్లాడుతూ ‘‘ భారతదేశపు మహోన్నతమైన సాంస్కృతిక వారసత్వం, పురాణాలు, చరిత్ర పట్ల చిన్నారులకు తొలి దశలోనే అవగాహన కల్పించడం అవసరం. ఎన్నో కారణాల రీత్యా పురాణాలు మరియు లెజండ్స్ ఇప్పుడు అత్యంత అవసరం. ఈ భాగస్వామ్యం ద్వారా మేము చిన్నారుల తెలివితేటలను మరింతగా పెంపొందించడంతో పాటుగా విలువలతో కూడిన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం’’ అని అన్నారు. ప్రతీక్ ధృవ, హెడ్– ఏసీకె లెర్న్ అండ్ లైసెన్సింగ్, అమర్ చిత్ర కథ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘యూనిఫార్మ్ జంక్షన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. దీనిద్వారా మరింత మందికి మా వర్క్‌షాప్‌లను చేరువ చేయడంతో పాటుగా బ్రాండ్‌కు తగిన విలువనూ తీసుకురానున్నాం. యూనిఫార్మ్ జంక్షన్‌తో సుదీర్ఘ అనుబంధం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై అభ్యాసాంశాలను అందుబాటులో ఉంచడంతో పాటుగా విభిన్న వయసుల చిన్నారులకు ఉచిత వర్క్‌షాప్‌లను సైతం నిర్వహించనున్నారు.