Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వినియోగదారు ఆరోగ్యం మరియు పరిశుభ్రత కంపెనీ, రెకిట్, తమ భాగస్వామి జాగ్రన్ పెహల్ తో కలిసి పంజాబ్, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ లు సహా 5 భారతదేశపు రాష్ట్రాలలో 5 కాలేజీల్ని ఏర్పాటు చేయడం ద్వారా హార్పిక్ వరల్డ్ టాయ్ లెట్ కాలేజ్ ఉనికిని విస్తరింప చేయనుంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఔరంగాబాద్ లో ఇటువంటి కేంద్రం ఉంది.
ఈ విస్తరణ ద్వారా, కాలేజ్ గౌరవప్రదమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాల్ని కొనసాగించడానికి 1 సంవత్సరంలో 7,000 మంది పారిశుద్ధ్య కార్మికులకు సాధికారత కలిగించే లక్ష్యాన్ని కాలేజ్ కలిగి ఉంది. కాలేజీలో వారు అందుకునే శిక్షణ సరైన విజ్ఞానం మరియు నైపుణ్యాల్ని అందచేస్తాయి, మెషీన్లు ఉపయోగించడం పై, నివారణ వ్యూహాలు, ప్రతిష్టాకరమైన, గుర్తించబడిన అంతర్జాతీయ, జాతీయ మరియు స్థానిక సంస్థలలో ఉద్యోగాల్ని సంపాదించడంలో వారికి గల హక్కులు మరియు అర్హతల్ని అర్థం చేసుకోవడం పై వారికి ఆచరణీయమైన శిక్షణల్ని ఇస్తాయి. చొరవలో భాగంగా, కాలేజ్ అందరికీ చైతన్యం కలిగించడానికి 50 స్వయం సహాయ సమూహాలకు కాలేజ్ మద్దతు కేటాయిస్తుంది. ఈ సమూహాలు సూక్ష్మ ఆర్థిక సంస్థలతో జత చేయబడతాయి మరియు వారి కోసం సాధ్యమైన సహకార నమూనా కోసం వ్యూహాత్మకమైన మద్దతు అందించబడుతుంది. దృఢమైన మరియు సమగ్రమైన శిక్షణలు మరియు పోస్ట్ ప్లేస్మెంట్ మద్దతు ద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధులు కోసం అవకాశాల్ని అందించడం ద్వారా పారిశుద్ధ్య కార్మికులుగౌరవప్రదమైన జీవితాల్ని కొనసాగించడంలో సహాయపడటమే హార్పిక్ వరల్డ్ టాయ్ లెట్ కాలేజ్ ప్రధాన లక్ష్యం. భారతదేశంలో పారిశుద్ధ్యం కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక, సామాజిక మరియు ఆరోగ్య సవాళ్లని దృష్టిలో పెట్టుకొని వారిని రక్షించి మరియు అభివృద్ధిపరచవలసిన ఎంతో అవసరం ఉంది. డాల్ బెర్గ్ నివేదిక 'శానిటేషన్ వర్కర్ సేఫ్టీ అండ్ లైవ్లీహుడ్ ఇన్ ఇండియా' ప్రకారం భారతదేశంలో పారిశుద్ధ్య కార్మికులకు సమానమైన 5 మిలియన్ (సుమారు)ఫుల్-టైమ్ కార్మికులు ఉన్నారు, వారు ప్రమాదానికి బహిర్గతమవడం మరియు విధానాల గుర్తింపు ద్వారా మారుతారు. వీరిలో 1 మిలియన్ కార్మికులు పట్టణ ప్రాంతాల్లో కాల్వలు మరియు సమాజంలో ప్రజలు పరిశుభ్రత కోసం మరియు 600 వేల మంది మరుగుదొడ్లని శుభ్రం చేయడానికి పని చేస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతం పారిశుద్ధ్య మౌలిక సదుపాయం క్రమబద్ధంగా పనివారిని ప్రమాదకరమైన పరిస్థితులలో ఉంచుతోంది; సామగ్రి మరియు ఉపకరణాలు సురక్షితం కాని పరిస్థితుల్ని పూర్తిగా తగ్గించవు. ఎదుర్కొంటున్న ప్రమాదాలు కోవిడ్ మహమ్మారి వలన తీవ్రతరమయ్యాయి, రక్షణ ఉపకరణాలు మరియు అధికారిక శిక్షణ లోపించడంతో హాట్ స్పాట్స్ ని డిస్ ఇన్ఫెక్ట్ చేసినప్పుడు, కోవిడ్ సంక్రమించిన రోగుల మృత దేహాల్ని రవాణా చేసినప్పుడు మరియు సంక్రమణకు గురైన జీవ వ్యర్థాల్ని నిర్వహించడం వంటి అదనపు పనుల్ని నిర్వహించేటప్పుడు కార్మికుల ఆరోగ్యం మరియు భద్రత పై ప్రభావం చూపిస్తున్నాయి. అసాధారణ వేళల్లో ప్రజానీకంతో నిరంతరంగా పని చేస్తుండటం వలన మహిళా పారిశుద్ద్య కార్మికులు సురక్షితం లేని పని వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు మరియు ఈ సమస్యని ప్రస్తావించడానికి ఎటువంటి వ్యవస్థా లేదు. గౌరవ్ జైన్, సీనియర్ వీపీ, రెకిట్, దక్షిణాసియా,ఇలా అన్నారు,"మెరుగైన ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పోషకాహారం ద్వారా ప్రజలు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జీవితాల్ని కొనసాగించడంలో మేము సహాయపడి మరియు మద్దతు చేయడానికి రెకిట్ లో మేము కట్టుబడ్డాము. మన దేశంలో పారిశుద్ధ్యం కార్మికుల స్థితి ఆందోళన కలిగిస్తోంది మరియు వారు గౌరవప్రదమైన జీవితాల్ని కొనసాగించడానికి వారి సమర్థవంతంగా చేసి, సాధికారత కలిగించాల్సిన తీవ్రమైన అవసరాన్ని మేము గుర్తించాము. హార్పిక్ వరల్డ్ టాయ్ లెట్ కాలేజ్ లో మేము పారిశుద్ధ్య కార్మికులకు సరైన నైపుణ్యాల్ని అందచేస్తున్నాము, ఇవి వారు ఉపాధి పొంది మరియు గౌరవప్రదమైన జీవితాలు కొనసాగించడంలో సహాయపడతాయి. ఇప్పటి వరకు 7,700 మందికి శిక్షణ ఇచ్చాము, ఇప్పుడు మేము ఈ చొరవని మరొక 5 రాష్ట్రాలలో విస్తరిస్తున్నాము, ఇవి మరింతమంది పారిశుద్ధ్య కార్మికులు తమ జీవితాల్ని అభివృద్ధి చేసుకుని మరియు గౌరవప్రదంగా జీవించడంలో సహాయపడతాయి." రవి భట్నాగర్, డైరక్టర్, ఎక్స్ టర్నల్ అఫైర్స్ మరియు పార్ట్ నర్ షిప్స్, ఎస్ఓఏ, రెకిట్, ఇలా అన్నారు," పారిశుద్ధ్య కార్మికులు మన దేశపు ఆరోగ్య వ్యవస్థకు వెన్నుముక వంటి వారు. దురదృష్టవశాత్తు, వారిలో చాలామంది ప్రమాదకరమైన పరిస్థితులలో పని చేస్తున్నారు, ఇది తీవ్రమైన వ్యాధులు మరియు ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఒక సంస్థగా మేము సమాజాల్ని మద్దతు చేయడానికి మరియు ప్రజలు ఆరోగ్యకరమైన మరియు గౌరవప్రదమైన జీవితాల్ని కొనసాగించడంలో సహాయపడటానికి కట్టుబడ్డాము. హార్పిక్ వరల్డ్ టాయ్ లెట్ కాలేజ్ ని 5 కొత్త రాష్ట్రాలకు విస్తరించడం ద్వారా, 7,000 మంది పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్ని పరివర్తనం చేయడానికి మరియు వారి సామాజిక-ఆర్థిక స్థితిలో సానుకూలమైన మార్పుని తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం." 5 అదనపు రాష్ట్రాలలో ప్రారంభించబడిన డిజిటల్ శిక్షణా కోర్స్ 5 ప్రాంతీయ భాషలలో డిజిటలీకరణ చేయబడుతుంది మరియు ప్రస్తుతమున్న పాఠ్యాంశం కూడా ఆడియో-ఆధారిత అభ్యాసనగా సవరించబడుతుంది, తద్వారా పారిశుద్ధ్య కార్మికులు అర్థం చేసుకుని మరియు నేర్చుకోవడానికి సులభమవుతుంది. ఔరంగాబాద్ లోని ద హార్పిక్ వరల్డ్ టాయ్ లెట్ కాలేజ్ , రెకిట్ సహకారంతో జాగ్రన్ పెహల్ మరియు కీలకమైన భాగస్వాములు రాష్ట్ర మునిసిపల్ కార్పొరేషన్స్ నుండి మద్దతుతో పాటు తమ చొరవ ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు సాధికారత కలిగించడాన్ని కొనసాగించే లక్ష్యాన్ని కలిగి ఉన్నారు." హార్పిక్ వరల్డ్ టాయ్ లెట్ కాలేజ్ మహారాష్ట్రలో ఔరంగాబాద్ లో 2018 ఆగస్ట్ లో అయిదు రోజుల తరగతి గది శిక్షణా మాడ్యూల్ తో ఏర్పాటు చేయబడింది. కోవిడ్-19 వ్యాపించిన నాటి నుండి, శిక్షణనిచ్చే అన్ని వర్క్ షాప్స్ యాప్ ఆధారిత కార్యక్రమం ద్వారా వర్ట్యువల్ గా నిర్వహించబడుతున్నాయి. ఇది ఆరంభమైన నాటి నుండి, కాలేజ్ పరివర్తనాపరమైన మార్పుని తీసుకురావడం పై దృష్టిసారించింది మరియు విజయవంతంగా 7,700 మంది పారిశుద్ధ్య పనివారికి గత 3 ఏళ్లల్లో విజయవంతంగా శిక్షణనిచ్చింది. ఇప్పటి వరకు శిక్షణ పొందిన 100% పారిశుద్ధ్య కార్మికులు సుస్థిరమైన ఉద్యోగాల్ని పొందారు, కొంతమంది ఆతిధ్య రంగం, సినిమాలు, ఆటో మరియు ఆసుపత్రి రంగాలు నుండి ప్రముఖ కార్పొరేట్లలో నియామకమయ్యారు. పారిశుద్ధ్య కార్మికులు కొత్త ఉద్యోగాలతో రాజీపడటానికి, నిర్వహించడానికి, సర్దుబాటు కావడంలో సహాయపడటానికి ఈ చొరవ వారికి పోస్ట్ ప్లేస్మెంట్ మద్దతుని కూడా అందిస్తుంది. హార్పిక్ వరల్డ్ టాయ్ లెట్ కాలేజ్ వారు చేసిన పనికి గాను మరియు వారు చేస్తున్న ప్రయత్నానికి గాను ప్రశంశించబడి మరియు గుర్తించబడింది. సామాజిక శ్రేయస్సు కోసం మహాత్మా గాంధీ పురస్కారం, పారిశుద్ధ్య శ్రేష్టత కోసం ఫిక్కీ పురస్కారం, యుఎన్ డీపీ డైవర్సిటీ, ఈక్విటీ మరియు ఉత్తమమైన సామాజిక సమీకరణ కార్యక్రమంగా ఇన్ క్లూజన్ పురస్కారాల్ని కాలేజీ పొందింది మరియు ఔరంగాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రశంశలు కూడా సంపాదించింది.