Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆరోగ్యకరమైన, రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం, పానీయాల కోసం కస్టమర్ల పెరుగుతున్న ప్రాధాన్యతను పరిగణిస్తూ, మెక్‌డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్,సౌత్) దాని McCafé మెనూలో రెండు కొత్త చేర్పులు - టర్మెరిక్ లాట్టే, మసాలా కడక్ చాయ్ లను ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులలో, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవటం అనేది మొదటి ప్రాధాన్యతగా ఉండటంతో, గత సంవత్సరం నుండి మనం చర్చించుకునే విషయాల్లో మొదటి పదం అదే అవుతుంది. ముఖ్యంగా ఈ మహమ్మారి కాలంలో ఇది చాలా కీలకంగా మారింది. ఈ కొత్త పానీయాలు రుచికరమైనవి మాత్రమే కాదు, మీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి, ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. టర్మెరిక్ లాట్టే అనేది ‘‘ హల్దీ దూద్’’లో ఒక ప్రత్యేకమైన - జలుబు, దగ్గు, ముక్కు మూసుకుపోవటం, ఇంకా అనేక రుగ్మతలను ఎదుర్కోవడానికి ఉపయోగించే పురాతన ఆయుర్వేద నివారణ లక్షణాలు గలది. ఈ పానీయం పసుపు యొక్క శ్రేష్టత్వంతో, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్ లమేటరీ లక్షణాలు అధికంగా ఉండే యాలకులు, కుంకుమపువ్వు వంటి ఇతర రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే పదార్థాలతో నింపబడి ఉంటుంది.
ఈ సంప్రదాయ పానీయం కోసం భారతీయ వినియోగదారుల ప్రేమ, భావోద్వేగం ద్వారా ప్రేరణ పొందిన మసాలా కడక్ చాయ్ ఒక కప్పులోనే మీకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది లాట్టే ఆకృతిని కలిగి ఉంది. మూలికలు, సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటుంది, తక్షణమే మీకు శక్తినిస్తుంది! మెనూలో కొత్త చేర్పుల గురించి మాట్లాడుతూ, మెక్‌డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ మరియు సౌత్) మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్- డైరెక్టర్, అరవింద్ RP ఇలా అన్నారు. "మెనూ ను వినూత్నంగా చేయడం మాకు నిరంతర ప్రయాణం, భారతీయ అంగిలిని సంతోషపెట్టడానికి రూపొందించిన ఈ కొత్త సమర్పణలను McCafé మెనూలో ప్రవేశపెట్టడానికి మేము సంతోషిస్తున్నాము. రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే వంటకాలు, ఉత్పత్తుల కోసం వినియోగదారులు ఆత్రుతగా చూస్తున్నారని అనేక అధ్యయనాలు, పరిశోధనలు తెలియజేశాయి. కస్టమర్ అంచనాల కంటే ఎల్లప్పుడూ ముందుండే బ్రాండ్‌గా, ఈ చేర్పులు మా కస్టమర్లకు సంబంధిత ఎంపికలను అందిస్తాయి.” ఈ కొత్త రోగనిరోధక శక్తిని పెంచే పానీయాలు అన్ని McCafé స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు ఈ పానీయాల కోసం కాంటాక్ట్‌లెస్ డెలివరీ, కాంటాక్ట్‌లెస్ టేక్ అవుట్ ద్వారా, ప్రయాణంలో ఉన్నప్పుడు ఆర్డర్ చేయవచ్చు లేదా వాటిని సమీపంలోని McCafé అవుట్‌లెట్‌లో పొందవచ్చు. రుచికరమైన వేడి, చల్లని కాఫీ ఎంపికల శ్రేణికి అదనంగా, McCafé 20 కంటే ఎక్కువ వాయురహిత పాల, పండ్ల ఆధారిత పానీయాలను కలిగి ఉంది.
మెక్‌డొనాల్డ్స్ వారి కస్టమర్లు, ఉద్యోగుల పూర్తి భద్రతను నిర్ధారించడానికి వారి గోల్డెన్ గ్యారంటీ వాగ్దానంలో భాగంగా కఠినమైన భద్రత, పరిశుభ్రత ప్రోటోకాల్‌లను అమలు చేస్తుంది.