Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: దేశంలో నం.1 స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ బ్రాండ్ షవోమీ తన ప్రీమియం శ్రేణి ఉత్పత్తులకు వినూత్నమైన దృశ్యపు గుర్తును ప్రకటించింది. తన గ్లోబల్ బ్రాండ్ ఉనికి అలాగే బ్రాండ్ మధ్య ఉన్న గ్రహింపు అంతరాన్ని భర్తీ చేసేందుకు తన ప్రీమియం ‘ఎంఐ’ సిరీస్ ఉత్పత్తులను ఇప్పుడు కొత్త లాంఛనం ‘షవోమీ’తో మార్చివేస్తోంది. తన కొత్త బ్రాండ్ గుర్తును పరిచయం చేయడంతో పాటు తన బేసిక్ కార్పొరేట్ బ్రాండ్‌లో భాగంగా రెండు ప్రత్యేక ఉత్పత్తి శ్రేణిని కలిగి ఉంటుంది. కార్పొరేట్ బ్రాండ్ ‘ఎంఐ’ లాంఛనంతో సమర్పించడాన్ని కొనసాగిస్తుంది. షవోమీ లైవ్లీనెస్, యూత్ఫుల్నెస్ను కొనసాగిస్తూ, కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తన కార్పొరేట్ లాంఛనంలో కొన్ని మార్పులను పరిచయం చేయగా, ఇందులో మృదువైన, లావుగా ఉండే ఔట్లైన్లతో అంచులు, వెనుక చట్రపు ఆకారపు లాంఛనం ఉండగా, దాన్ని ‘ఎంఐ’ టైపోగ్రఫీతో రీడిజైన్ చేశారు.
గత ‘ఎంఐ’ బ్రాండ్ సాంకేతికత శిఖరానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. వివిధ విభాగాల్లో ప్రీమియం అనుభవాన్ని అందిస్తుండగా దీన్ని ఇప్పుడు ‘షవోమి’ సిరిస్‌గా రీ బ్రాండ్ కానుంది. అందుబాటు ధరల్లో మహోన్నత సాంకేతికతను తీసుకు వచ్చే ‘రెడ్మి’ అదే లాంఛనంతో కొనసాగుతుంది. ఈ పేరు మార్పు షవోమీ, రెడ్మి-రెండు బ్రాండ్ల టీవీ, ల్యాప్‌టాప్, ఐఓటీ ఆఫర్లకు అన్వయిస్తుంది. ఈ ప్రకటన గురించి షవోమీ ఇండియా మార్కెటింగ్ విభాగాధిపతి జస్కరణ్ సింగ్ కహాని మాట్లాడుతూ, ‘వినియోగదారుల-కేంద్రిత బ్రాండ్‌గా సదా వికసన చెందుతున్న వినియోగదారుల అవసరాలను అందించే కొత్త, ఆవిష్కారాత్మక సాంకేతికతలను అన్ని వలయాలను తీసుకురావడం మా ప్రాధాన్యతగా ఉంది. మేము మా వినియోగదారులు, షవోమీ ఫ్యాన్స్ ద్వారా మా ప్రీమియం ఉత్పత్తుల శ్రేణికి అద్భుత ప్రతిస్పందన అందుకుంటున్నాము. కౌంటర్ పాయింట్ తన మే 2021 నివేదిక ప్రకారం, షవోమీ ఇండియా 20కె-45కె విభాగంలో 14% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది వినియోగదారుల అనుభవాన్ని మరింత ఉన్నతీకరించేందుకు సాంకేతికత, ఆవిష్కరణల హద్దులను మరింత విస్తరించేందుకు మమ్మల్ని తయారుగా ఉంచింది’ అని పేర్కొన్నారు.
‘ప్రపంచవ్యాప్తంగా సదృఢమైన వ్యాప్తితో అగ్రగామి సాంకేతికత బ్రాండ్‌గా మా లక్ష్యం ఏకీకృత ఉనికిని పొందే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. ఈ కొత్త లాంఛనం మార్పుతో మేము మా బ్రాండ్, ఉత్పత్తుల మధ్య గ్రహింపు అంతరాన్ని భర్తీ చేయాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము. కొత్త షవోమీ లాంఛనాన్ని సాంకేతికత శ్రేష్ఠత అలాగే ప్రీమియం అనుభవాన్ని అందించే మా ప్రీమియం ఉత్పత్తులకు వినియోగిస్తున్నాము. ఈ పండుగ సీజన్‌కు షవోమి ప్రీమియం ఉత్పత్తుల శ్రేణి ‘ఎంఐ’ను ‘షవోమి’గా వ్యవహరించనున్నారు’’ అని వివరించారు. ప్రతి ఒక్కరికీ ఆవిష్కరణలను అందించే, ప్రీమియం వినియోగదారుల పరిధిని విస్తరించే ఈ కొత్త గుర్తు షవోమీని రానున్న సంవత్సరాల్లో మరింత ఉన్నత శిఖరాలకు తోడ్కొని వెళ్లనుంది.