Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో ఈ సంవత్సరం క్వాలిఫయర్ రౌండ్లను అత్యంత సౌకర్యవంతంగా వర్ట్యువల్‌గా నిర్వహించబోతున్నారు. ఈ క్వాలిఫయర్ రౌండ్లు ఒక్కోటి నాలుగు రోజుల చొప్పున జరుగుతాయి. ఈ పోటీలు సెప్టెంబర్ 16, అక్టోబర్ 7, అక్టోబర్ 28, నవంబర్ 18 తేదీలలో జరుగుతాయి. ఈ క్వాలిఫయర్ రౌండ్లను అనుసరించి గ్రాండ్ ఫైనల్ డిసెంబర్4,5 తేదీలలో జరుగనున్నాయి. ఈ–స్పోర్ట్స్ ప్రియులు ఈ క్వాలిఫయర్ల కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పోటీలలో సత్తా చాటిన వారికి మాత్రమే ఫైనలిస్ట్‌లుగా పాల్గొనే అర్హత లభిస్తుంది. ఈ క్వాలిఫయర్ రౌండ్లను ఎలిమినేషన్ రౌండ్లగా పేర్కొంటున్నారు. ఈ పోటీలలో విజయం సాధించడం ద్వారా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. అక్కడ కూడా విజయం సాధిస్తే 10 లక్షల రూపాయల బహుమతిని వారికి అందజేస్తారు.
ఈ సంవత్సరం నాలుగు ఈ– స్పోర్ట్స్ గేమ్‌లు– వాలోరెంట్, రెయిన్బో, 6సీజ్, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ లో పోటీపడాల్సి ఉంటుంది. ఈ ఉత్సాహాన్ని మరింత ఉన్నతంగా మలిచేందుకు వాలోరెంట్ మరియు సీఓడీఎం ఫైనల్స్‌ను అధికారిక తైవాన్ ఎక్స్‌లెన్స్ ఇండియా ఛానెల్స్‌పై డిసెంబర్లో ఆన్లైన్లో ప్రసారం చేయనున్నారు. ఈ టీఈజీసీ గురించి తైవాన్ ఎక్స్‌లెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్క్ వు మాట్లాడుతూ ‘‘ భారతదే శంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ–స్పోర్ట్స్ చాంఫియన్‌షిప్‌లో టీఈజీసీ ఒకటి. గత సంవత్సరం భారతదేశం నుంచి 8వేలకు పైగా రిజిస్ట్రేషన్లు చూశాం. ఔత్సాహిక గేమర్లు తమ ప్రతిభను ప్రదర్శించుకునే అద్భుత అవకాశం ఇది అందిస్తుంది. ప్రతి సంవత్సరం మేము నూతన అంశాలను జోడించడానికి ప్రయత్నిస్తుంటాం. ఈ సారి నూతన ప్రాచుర్యం పొందిన గేమ్స్ జోడించాం మరియు మరింత మంది ఈ పోటీలలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు. ఈ ఎనిమిదవ ఎడిషన్ టీఈజీసీకి సుప్రసిద్ధ తైవనీస్ బ్రాండ్లు అయిన ఏసర్, అసుస్, ఏడాటా, బెన్క్యు, డీ–లింక్, గిగాబైట్, ఇన్విన్, ఎంఎస్ఐ, థర్మల్ టేక్, జిక్జెల్ సహకారం అందిస్తున్నాయి.