Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: అమెజాన్ ఇండియా బెంగళూరు నగరంలో 2.4 మిలియన్ క్యూబిక్ అడుగుల మేర స్టోరేజ్ సామర్థ్యంతో దేశంలోనే తన అత్యంత పెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ (FC) ప్రారంభించింది. దీని ప్రారంభంతో కర్ణాటక రాష్ట్రంలో అమెజాన్ ఇండియా తన మొత్తం సామర్థ్యాన్ని 60% మేర వృద్ధి చేసుకుని, ఇప్పుడు 5 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాల్లో 6.5 మిలియన్ క్యూబిక్ అడుగుల మేర స్టోరేజ్ స్థలాన్ని కలిగి ఉంది. పండుగ సీజన్ నేపథ్యంలో మౌలిక సదుపాయాల్లో ఈ గమనార్హమైన విస్తరణతో కర్ణాటకలోని 42,000కు పైచిలుకు విక్రేతలకు దేశ వ్యాప్తంగా ఉండే అపార సంఖ్యలోని వినియోగదారులకు గతంలో కన్నా ఎక్కువ లభ్యతను అందిస్తుంది. ఈ విస్తరణ ద్వారా అన్ని నేపథ్యాలు ఉన్న వ్యక్తులకు ముఖ్యంగా సమీప ప్రాంతాల్లో ఉండే స్థానికులకు విస్తృతమైన, అర్థవంతమైన పని అవకాశాలను కూడా సృష్టిస్తుంది. వీటిలో తన ఆపరేషన్స్ నెట్వర్క్ నుంచి పూర్తి స్థాయి, పార్ట్‌టైమ్ అవకాశాల వరకు, శిక్షణ మరియు కౌశల్యాభివృద్ధి అవకాశాలతో అందుబాటులోకి వస్తోంది.
‘‘కర్ణాటక మాకు అత్యంత ప్రముఖ ప్రదేశంగా ఉంది. మేము రాష్ట్రంలో స్థానికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాము. మౌలిక సదుపాయాలు, సాంకేతికతలో మా కేంద్రీకృత పెట్టుబడికి సంబంధించిన నిబద్ధతకు సాక్ష్యంగా ఉంది. దేశంలో అత్యంత పెద్ద ఫుల్ఫిల్మెంట్ కేంద్రం ప్రారంభంతో మేము పోటీతో కూడిన వేతనాలతో వేలాది మందికి ఎక్కువ పని అవకాశాలను సృష్టించేందుకు వేచి చూస్తున్నాము. ఈ విస్తరణ ద్వారా విక్రేతలకు అమెజాన్‌లోని ఫుల్ఫిల్మెంట్ ఆఫర్లకు సులభ ప్రవేశాన్ని అందిస్తుంది. వినియోగదారులకు విస్తృత స్థాయిలో ఉత్పత్తుల ఎంపికకు వేగవంతమైన వితరణ అందిస్తుంది’’ అని అమెజాన్ ఇండియా కస్టమర్ పుల్‌ఫిల్‌మెంట్ ఆపరేషన్స్ అండ్ సప్లయ్ చెయిన్ ఉపాధ్యక్షుడు ప్రకాశ్ దత్త తెలిపారు.
అమెజాన్ ఇండియా ఫుల్ఫిల్మెంట్ నెట్వర్కు భవంతులను అత్యాధునిక సాంకేతికత, దక్షతతో కూడిన నిర్మాణ వ్యవస్థలతో నిర్మించగా, అవి విద్యుత్తును తక్కువగా వినియోగించుకుంటాయి అలాగే సౌరశక్తిని ఉత్పత్తి చేసేందుకు ఆన్-సైట్ మరియు ఆఫ్‌సైట్ సౌర ఫలకాలను కలిగి ఉంది. చాలా వరకు భవంతులను వర్షం నీటి సేకరణ తొట్లు, ఇంకుడు గుంతలు, ఆక్టిఫర్లతో మురుగు నీటి సంస్కరణ కేంద్రాలు తదితర ప్రయత్నాలతో జీరో నీటి వినియోగానికి అనుగుణంగా డిజైన్ చేశారు. అందరినీ కలుపుకుని వెళ్లే ఉద్యోగాలకు స్థానం కల్పించేందుకు ఫుల్ఫిల్మెంట్ కేంద్రాల్లోకి దివ్యాంగులు సులభంగా ప్రవేశించేందుకు సాధ్యమయ్యేలా డిజైన్ చేశారు.
నేను కోలారు జిల్లా నాగొండనహళ్లి నుంచి వచ్చాను. కొత్త ఫుల్ఫిల్మెంట్ కేంద్రంలో అసోసియేట్‌గా పని చేస్తున్నాను. ఇక్కడ వినియోగదారుల ఆర్డర్లను ప్యాక్ చేసి పంపించడమే నా పని. కొత్త ఎఫ్‌సి వాస్తవానికి అత్యంత పెద్ద భవంతి మాలో పలువురు వినియోగదారులు ఆర్డర్లను ఎంపిక చేసుకునేందుకు, ప్యాక్ చేసేందుకు లేబుళ్లను వేసే పని చేస్తున్నారు. మా గ్రామానికి చేరువలోనే పని చేయడం నాకు సంతోషంగా ఉంది అలాగే నేను నా కుటుంబంతో కలిసి ఉంటూ, వారిని చూసుకునేందుకు అవకాశం కలిగింది’’ అని అమెజాన్ ఎఫ్‌సి అసోసియేట్ వినయ్ ఎన్.ఎస్. తెలిపారు. కర్ణాటకలో విస్తరణ 2021 నాటికి భారతదేశ వ్యాప్తంగా తన విక్రేతలకు 43 మిలియన్ క్యూబిక్ అడుగుల మేర మొత్తం స్టోరేజ్ సామర్థ్యాన్ని అందించే లక్ష్యంతో భారతదేశ వ్యాప్తంగా విస్తరణ పథకాల్లో భాగంగా ఉంది. అమెజాన్ అత్యంత మెరుగైన ఫుల్ఫిల్మెంట్ నెట్వర్కుల్లో ఒకదాన్ని సృష్టించింది. భారతదేశంలో విక్రేతలు ఫుల్ఫిల్మెంట్ నెట్వర్కుల్లో ఒకదాన్ని సృష్టించింది. భారతదేశంలో విక్రేతలు ఫుల్ఫిల్మెంట్లో అమెజాన్ పరిణితి, విశ్వసనీయత, దేశ వ్యాప్తంగా వితరణ, వినియోగదారుల సేవలతో అనుకూలతను పొందుతున్నారు. అమెజాన్ ఇండియా కొవిడ్-19కు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనడంతో తన ఫుల్ఫిల్మెంట్ నెట్వర్కు వ్యాప్తంగా తన సిబ్బంది సౌఖ్యత, సురక్షతకు అపారమైన విలువ,దృష్టి పెడుతోంది. కంపెనీ ఆరోగ్య అధికారులతో నిరంతరం పని చేయడాన్ని కొనసాగించింది. ఇది తన అసోసియేట్లు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు అనుమతి పొందిన ఆరోగ్య సేవల కార్యకర్తలతో ఆన్-సైట్ టీకా శిబిరాలను కూడా నిర్వహిస్తోంది.