Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జియూన్ నుంచి జింబల్ ఆవిష్కరణ
హైదరాబాద్ : తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన వీడియోలను తీసేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ సంస్థ జియూన్ భారత మార్కెట్లోకి సరికొత్త జింబల్స్ స్మూత్ క్యు3, విబిల్ 2ను విడుదల చేసింది. ఈ జింబల్లో త్రీ-యాక్సిస్, రొటేటబుల్ ఫిల్ లైట్, 17 స్మార్ట్ టెంప్లేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయని.. అదే విధంగా 4300కె వార్మ్ టోన్డ్ ఇంటిగ్రేటెడ్ ఫిల్ లైట్ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. వీటి సాయంతో తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన వీడియోలను మరిన్ని యాంగిల్స్‌లో తీసే వీలు కలుగుతుందని తెలిపింది. భారత మార్కెట్లో ప్రస్తుతం తమ బ్రాండ్ నుంచి 11 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని జియూన్ ఇండియా ప్రతినిధి మయాంక్ చచ్రా తెలిపారు.