Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ప్లాస్టిక్ రీసైక్లింగ్ సంస్థ శ్రీచక్ర పాలీప్లాస్ట్ తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ సదుపాయాన్ని ప్రారంభించినట్టు తెలిపింది. ఆధునికరించిన ఈ రిసైకిల్డ్ ప్లాంట్‌ను హైదరాబాద్ సమీపంలోని పటన్చెర్లో ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. ఇందుకోసం దాదాపు రూ.70 కోట్ల వ్యయం చేసినట్టు పేర్కొంది. దేశంలో ఫుడ్ గ్రేడ్ నాణ్యత కలిగిన రీసైకిల్డ్ పాలిథ్లీన్ టెరిఫాథలెట్ (పెట్) పెలెట్స్‌ను ఉత్పత్తి చేస్తున్న మొట్టమొదటి కర్మాగారం ఇదేనని తెలిపింది. అత్యున్నత గ్రేడ్ రీసైకిల్డ్ ప్లాస్టిక్‌ను దేశంలోని వినియోగదారులతో పాటు యూరోప్, అమెరికా తదితర అంతర్జాతీయ మార్కెట్లకు సైతం తన ఉత్పత్తునలు సంస్థ ఎగుమతి చేయనున్నట్టు వెల్లడించింది.