Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాతాదారులకు రూ.1 కోటి ప్రయోజనాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ)లో పలు సంస్థల్లోని ఉద్యోగుల కోసం ''శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్''ను ఆవిష్కరించింది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లోని ఉద్యోగులు ఉచితంగా రూ.1 కోటి వరకు ప్రయోజనాలను పొందవచ్చని ఆ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్లో వేతన ఖాతా కలిగిన ఉద్యోగులకు రూ.30 లక్షల వరకు వ్యక్తిగత యాక్సిడెంటల్ మృతి బీమా కల్పిస్తుంది. అర్హులైన వేతన ఖాతాదారులకు రూ. 2 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం అందించనున్నట్లు పేర్కొంది. ఉచితంగా గోల్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు, ఏడాదికి 100 చెక్స్ లీవ్స్ అందిస్తుంది.