Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: న్యూ నార్మల్‌లో సురక్షితంగా, అందుబాటు ధరలో ఉద్యోగులు ఉద్యోగులు ఇళ్ల నుంచి కార్యాలయాలకు రాకపోకలు కొనసాగించేందుకు అనువుగా ఉబర్ కార్పొరేట్ షటిల్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఉబర్ నేడు ప్రకటించింది. ఉబర్ కార్పొరేట్ షటిల్ అనేది కంపెనీల కోసం కస్టమైజ్ చేసిన ప్రయాణ సేవ కాగా, ఇది ఒకే వాహనంలో 10-50 మంది ఉద్యోగులకు సీటింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. విశ్వసనీయమైన, సురక్షితమైన, తక్కువ ఖర్చులో ప్రయాణాన్ని నిర్ధారించేందుకు ఉబర్ తన ప్రధాన సాంకేతికతను ఉపయోగించుకుంటుండగా, ఈ సేవల ద్వారా కంపెనీలు తమ సుస్థిరత లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు అలాగే, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆఫీస్ పార్కింగ్ స్థలాల్లో రద్దీ లేకుండా చూసుకునేందుకు సహాయపడతాయి. ఉబర్‌లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఉబర్ కార్పొరేట్ షటిల్ లోగో ఆన్లైన్ చెక్‌లిస్ట్, డ్రైవరు, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించే విధానం, ప్రీ-ట్రిప్‌లో డ్రైవర్లకు మాస్కు వెరిఫికేషన్ సెల్ఫీలు, భద్రతాపరమైన ఎస్ఓపీల గురించి డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలవంటి సమగ్రమైన సెఫ్టీ మేజర్స్ ఉన్నాయి. ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, పుణె, ముంబయి, బెంగళూరు నగరాల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఉబర్ కార్పొరేట్ షటిల్ సేవలు ప్రారంభించడం గురించి ఇండియా&సౌత్ ఆసియా యుబర్ ఫర్ బిజినెస్ హెడ్ అభినవ్ మిట్టూ మాట్లాడుతూ ‘ఉబర్‌లో మేము మారిపోతున్న మా వినియోగదారుల అవసరాలను పరిష్కరించడంపై దృష్టి సారించాము. ఉబర్ కార్పొరేట్ షటిల్ ద్వారా కంపెనీలు తమ ఉద్యోగులకు మొదటి స్థానం కల్పించడంలో సహాయపడుతుంది. వారు ట్రాఫిక్ జామ్‌లు, పార్కింగ్, కారు నిర్వహణ ఖర్చు లేకుండా సురక్షితంగా పనికి చేరుకునేందుకు అవవకాశం కల్పిస్తుంది. ఉద్యోగులు తమ కార్లను ఇళ్లవద్దే ఉంచడం ద్వారా, మన నగరాల్లో రద్దీ, కాలుష్యం మరియు కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తాయి. సుమారు 20 నెలల గడ్డు పరిస్థితుల అనంతరం భారతదేశంలోని ఉద్యోగులు సురక్షితంగా తిరిగి పని చేసేందుకు వచ్చేందుకు సహకారం అందించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము’ అని పేర్కొన్నారు.
ఉబర్ కార్పొరేట్ షటిల్ అనేది ఉబర్ అందిస్తున్న మరొక ప్రొడక్ట్ కాగా, ఇది సంస్థలకు మరింత సామర్థ్యంతో వారి వ్యాపార ప్రయాణాలను నిర్వహించుకునేందుకు, ఖర్చులను నియంత్రించుకునుందకు మరియు తమ ఉద్యోగుల అనుభవాన్ని మెరుగుపరచుకునేందుకు మరింత సమర్థవంతమైన మార్గాన్ని అందిస్తుంది. భారతదేశంలో ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఆఫీస్-గోయర్స్ ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఉబర్ హై కెపాసిటీ వెహికల్స్ ప్రోగ్రామ్ నుంచి భారతదేశంలో ప్రారంభించిన మొదటి ఉత్పత్తి ఇది. ఉబర్ కార్పొరేట్ షటిల్ కోసం సాంకేతికత మరియు ప్రొడక్ట్ బిల్డ్ ఔట్‌కు సంబంధించిన పనిలో గణనీయమైన వాటాకు బెంగుళూరులోని ఉబర్ సాంకేతిక బృందం నేతృత్వం వహిస్తోంది. కంపెనీలు, ఉద్యోగులకు ఉబర్ కార్పొరేట్ షటిల్ప్రయోజనం చేకూరుస్తుంది. భవిష్యత్తులో సుస్థిరమైన నగరాలను నిర్మించడంలో సహాయపడుతుంది.
కంపెనీలకు
· ప్రాథమికరవాణాసమస్యలనుపరిష్కరిస్తుంది, కంపెనీనగదును ఆదాచేస్తుంది, ఉద్యోగులకు భద్రతను వృద్ధి చేస్తుంది, ఉత్పాదకతనుపెంచుతుందిమరియుఉద్యోగులు సంస్థలో కొనసాగేలా ప్రభావాన్ని చూపిస్తుంది.
· ఉద్యోగి శ్రేయస్సుకు భరోసా ఇస్తుంది. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
· ఉద్యోగిపై ఒత్తిడిని తగ్గిస్తూ ఉత్పాదకను పెంచుకునేందుకు, స్ఫూర్తిని ఇస్తుంది.
ఉద్యోగులకు
· ప్రజా రవాణా వ్యవస్థ పరిమితంగా ఉన్న ఈ సమయంలో విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన సురక్షితమైన రవాణా పరిష్కరణలు అందిస్తుంది.
· వాహన రద్దీ సమస్యలతో తలెత్తే ఒత్తిడిని తగ్గిస్తుంది. పగటి వేళ్లలో వ్యక్తిగత కార్యకలాపాలకు ఎక్కువ సమయాన్ని అందిస్తుంది.
· కారు నిర్వహణ ఖర్చుల్లో గణనీయమైన ఆదా
నగరాలకు
· కాలుష్యం మరియు ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది.
· ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది
· పార్కింగ్‌కు కేటాయించే అవసరమైన మౌలిక సదుపాయాలను తగ్గించడం ద్వారా నగరాల్లో మరింత నివాసయోగ్యమైన స్థలాలను సరికొత్తగా నిర్వచిస్తుంది.