Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: 2.4 బిలియన్ డాలర్ల విలువైన సీకే బిర్లా గ్రూప్‌లో అంతర్భాగమైన కంపెనీ ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్. ఇప్పటికే ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ నుంచి ఎన్నో అద్బుతమైన ఉత్పత్తులు వచ్చాయి. అవన్నీ వినియోగదారుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్.. స్టెల్లా మాడ్యులర్ స్విచ్‌లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. భద్రత, మన్నిక, పనితీరు మరియు స్టైల్‌గా ఉండేట్లుగా ఈ స్విచ్‌లను రూపొందించారు. ఈ స్టెల్లా రేంజ్లో స్విచ్‌లు, సాకెట్స్, ప్లేట్స్, హాస్పిటాలిటీ రేంజ్, ఇతర ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్, స్టైల్‌తో అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అన్నింటికి ఈ స్విచ్‌లు రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేసెస్ అన్నింటికి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. కంపెనీ మార్కెట్ విస్తరణ, మరింత వ్యాప్తి చెయ్యాలనే లక్ష్యంలో భాగంగా ఈ మాస్ ప్రీమియ్ స్విచ్‌లను రూపొందించారు.
ఈ సందర్భంగా ఓరియంట్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ ధావన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... మామూలు స్విచ్‌లతో పోలిస్తే మాడ్యులర్ స్విచ్‌ల వినియోగం గత కొన్నేళ్లుగా బాగా పెరిగింది. అన్నింటికి మించి భారతీయ వినియోగదారులకు మాడ్యులర్ స్విచ్‌లు అందించే ప్రయోజనాల గురించి అవగాహన ఉంది. ఈ స్విచ్‌లలో మెరుగైన భద్రత, ఇన్స్టాల్ సౌలభ్యం లాంటి అత్యుత్తమ ప్రయోజనాలున్నాయి. వాటితోపాటు సమర్థత, అనుకూలీకరణ, మెరుగైన సౌందర్యం లాంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. దీనివల్ల వినియోగదారులు మంచి మంచి కంపెనీలు అందించే బ్రాండెడ్ ఉత్పత్తుల కోసం చూస్తున్నారు. వినియోగదారుల అవసరాలు, వారి ఆలోచనలకు అనుగుణంగా మేం ఈ స్టెల్లా మాడ్యులర్ స్విచ్‌లను రూపొందించి అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సరికొత్త ఉత్పత్తులు వినియోగదారులకు ఇష్టమైన విలక్షణమైన డిజైన్లు, యూజర్-సెంట్రిక్ ఫీచర్లతో వస్తాయి. ప్రస్తుతం ఉన్న మా ఉత్పత్తులకు అదనంగా ఈ స్టెల్లా మాడ్యులర్ స్విచ్‌లు ఉన్నాయి. వీటిద్వారా కూడా మాకు మార్కెట్ నుండి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాము అని అన్నారు ఆయన.
ఓరియంట్ స్టెల్లా మాడ్యులర్ స్విచ్‌లు అత్యుత్తమమైన క్వాలిటీతో తయారు చేశారు. వీటిని గ్లాస్ ఫిల్డ్ పాలికార్బోనేట్తో తయారు చేశారు. అంతేకాకుండా ఇందులో షాక్-రెసిస్టెంట్, ఫైర్-రిటార్డెంట్ ఫీచర్లు ఉన్నాయి. దీనివల్ల భద్రత మరింత పెరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన యాంటీ-వెల్డ్ ఫీచర్ వల్ల స్విచ్ ఆపరేషన్ సమయంలో కాంటాక్ట్ వెల్డ్స్ వద్ద భద్రతను అందిస్తుంది. దానికి కారణం ఆర్క్ షీల్డింగ్ మెకానిజం మరొక రక్షణగా పనిచేయడమే. ఓరియంట్ స్టెల్లా స్విచ్‌లు మరియు సాకెట్లు మృదువైన ఆపరేషన్ కోసం రూపొందించబడ్డాయి. 1,00,000 పైగా సుదీర్ఘ క్లిక్స్‌ను కలిగి ఉంటాయి. ఈ రేంజ్‌లోని అన్ని ఉత్పత్తులు ఫ్రంట్-లోడింగ్ మెకానిజంతో వస్తాయి. ఇది సులభంగా ఇన్స్టాల్ చేయడానికి అనుమతిస్తుంది మరియు సొగసైన రూపాన్ని ఇస్తుంది. కనెక్షన్ సౌలభ్యం కోసం ఇది పెద్ద మరియు మెరుగైన కనెక్ట్ టెర్మినల్స్ కూడా ఉంది. అన్నింటికి మించి ఇందులో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్.. USB ఛార్జర్ ద్వారా వేగవంతమైన ఛార్జింగ్‌ను చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్విచ్‌లు, బోర్డులు అన్ని తాజా ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుకూలంగా ఉంటాయి. ఓరియంట్ స్టెల్లా రేంజ్ మిర్రర్ ఫినిష్‌తో ఎర్గోనామిక్ డిజైన్లతో వస్తుంది. ఇది దుమ్ము చేరడాన్ని కూడా తొలగిస్తుంది.