Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విద్యుత్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. భారతదేశపు నెంబర్ 1 ఈమాస్ (ఎలక్ట్రిక్ మొబిలిటీ యాజ్ ఏ సర్వీస్) కంపెనీగా నిలకడతో కూడిన స్వచ్ఛమైన రవాణా సేవలపై పూర్తిగా దృష్టి సారించి సమగ్రమైన రవాణా సేవలను అందిస్తుంది. ఈటీఓ మోటర్స్ తమ 3ఈ ప్రాధమిక సూత్రాలైనటువంటి పర్యావరణం, ఉపాధి, సాధికారితపై కృషి చేస్తుంది. గుజరాత్‌లోని కేవాడియా వద్ద విద్యుత్ మూడు చక్రాల ప్రయాణీకుల వాహనాలు ట్రైలక్స్ను పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఒకే ఒక్క కంపెనీ ఈటీఓ. ఇక్కడ 100 మందికి పైగా స్థానిక నిరుద్యోగ మహిళలకు విద్యుత్ మూడు చక్రాల వాహనాలను నడుపడంలో శిక్షణ అందించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు గుజరాత్‌లోని కేవాడియాను దేశంలో మొట్టమొదటి, వాస్తవిక ఈవీ జోన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన ఈ నగరానికి అక్టోబర్ 31న రావడంతో పాటుగా నేషనల్ యూనిటీ డేను లాంఛనంగా ఇక్కడ విద్యుత్ బస్సులు, కార్లు,రిక్షాలను ప్రారంభించడం ద్వారా వేడుక చేయనున్నారు. శక్తి, అభివృద్ధి, సంపదకు ప్రతీక గులాబీ అని మహిళా పైలెట్లను ఉద్దేశించి బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్, నర్మద బీజెపీ అధ్యక్షులు ఘన్‌శ్యామ్ పటేల్ అన్నారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు యాత్రికులను తీసుకువెళ్లి, తీసుకువస్తున్న మహిళలను ఉద్దేశించి వీరు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే రీతిలో కేంద్ర మహిళ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖామాత్యులు స్మృతి జుబిన్ సైతం తన కేవాడియా సందర్శనలో మహిళలను అభినందించారు. ఈటీఓ మోటర్స్ ప్రారంభించిన ఈ కార్యక్రమం, వాస్తవిక పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థ దిశగా దేశం పయణించడానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఈ కార్యక్రమం గురించి ఈటీఓ సీఈఓ – మేనేజింగ్ డైరెక్టర్ నరేష్ కుమార్ రావల్ మాట్లాడుతూ ‘‘మా విద్యుత్ రవాణ పరిష్కారాలు, మహిళా శక్తి పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. అఖండ భారతావని నిర్మాతగా భావించే సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కు ఇది అసలైన నివాళి’’ అనిఅన్నారు
ఈటీఓ తమ ఎల్5 ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ వాహనాలను ట్రైలక్స్గా కెవాడియా వద్ద నిలిపింది. దీనిలో ప్రయాణీకులతో పాటుగా డ్రైవర్‌కు సైతం సేఫ్టీ బెల్ట్ ఉంటుంది. అలాగే మరెన్నో మహోన్నత ఫీచర్లు సైతం దీనిలో ఉన్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 138 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.