Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పరిశోధనాధారిత అంతర్జాతీయ క్లీనికల్ న్యూట్రిషన్ సంస్థ ఎస్పెరర్ న్యూట్రిషన్ (ఈఓఎన్) దేశంలోనే తన తొలి క్యాన్సర్ రీసెర్చ్ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్టు తెలిపింది. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పెరర్ న్యూట్రిషన్ వ్యవస్థాపకులు, సీఈఓ రకీం చటోపాధ్యారు మాట్లాడుతూ వినూత్నమైన న్యూట్రిషనల్ చికిత్సలను వినియోగించి అత్యంత క్లిష్టమైన వ్యాధుల నివారణ, నిర్వహణ చేయడంలో ముందున్నామన్నారు. నూతన న్యూట్రిషన్ పరిశోధనా కేంద్రం నాణ్యమైన క్షేత్రస్ధాయి, ల్యాబ్ అధ్యయనాలను అందించడంతో పాటుగా వినియోగదారులకు మెరుగైన ఫలితాలను అందించనున్నామన్నారు. ప్రస్తుతం తాము 9 ఉత్పత్తులను కలిగి ఉన్నామని.. వచ్చే మార్చి కల్లా 12కు చేర్చనున్నామన్నారు. ప్రతి సంవత్సరం భారత్లో 8 లక్షల నూతన కేసులు నమోదవుతు న్నాయన్నారు. క్యాన్సర్ రోగుల జీవిత నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడంతో పాటుగా పలు క్యాన్సర్ నివారణ సైకలాజికల్ పరిస్థితులు (ఎన్సీడీలు) మెరుగుపరచనున్నామన్నారు.