Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత మార్కెట్లో ఐఫోన్13 సిరీస్ ధరల వెల్లడి
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఆపిల్ నూతన ఆవిష్కరించిన ఐఫోన్ 13, ఐఫోన్ 13మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్ల ధరలను ప్రకటించింది. భారత్‌లో కేవలం 3 శాతం మార్కెట్‌కే పరిమితమైన ఆపిల్ కంపెనీ ఈ దఫా ఇక్కడ తన వ్యాపారం, వాటాను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ టిమ్ కుక్ భారత్ మార్కెట్లోని ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ధరల్ని ప్రకటించారు. ఆ వివరాలు.. ఐఫోన్ 13ప్రో మ్యాక్స్‌లో 128జిబి ధర రూ.1,29,900గా, 256జిబి రూ.1,39.900గా, 512జిబి రూ.1,59,900గా, 1టెరాబైట్ వేరియంట్ ధర రూ. 1,79,900గా నిర్ణయించింది. ఐఫోన్ 13 ప్రోలో 128జిబి (రూ.1,19,900), 256జిబి (రూ.1,29,900), 512జిబి (రూ. 1,49,900), 1టెరాబైట్ (రూ. 1,69,900)గా ప్రకటించింది. ఐఫోన్ 13 సీరిస్‌లో 128జిబి (రూ.79,900), 256బిజి (రూ.89,900), 512జిబి (రూ. 1,09,900) వేరియంట్లు ఉన్నాయి. ఐఫోన్ 13 మినీలో 128జిబి (రూ.69,900), 256జిబి (రూ. 79,900), 512జిబి (రూ.99,900) మోడళ్లున్నాయి. ఆపిల్ ఆవిష్కరించిన ఐఫోన్13 సిరీస్ ఫోన్ ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్17 సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి.