Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో టాటా గ్రూపు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా ప్రయివేటీకరణ బిడ్డింగ్ గడువు బుధవారంతో ముగిసింది. ఈ సంస్థ కొనుగోలుకు ఆసక్తి ఉన్న కంపెనీలు బిడ్ దాఖలు చేసేందుకు ఇకపై గడువు పెంచబోమంటూ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. ఎఐ కొనుగోలుకు చివరి తేది వరకు కూడా పెద్దగా కంపెనీలు ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. టాటా గ్రూపుతో పాటు స్పైస్ జెట్ సంస్థలు కొనుగోలుకు ముందుకు వచ్చాయని సమాచారం. ఎయిరిండియా భారీగా నష్టాల పాలైనప్పటికీ వేల కొట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ముంబయి, ఢిల్లీ తదితర టాప్ నగరాల్లో వందల ఎకరాల కొద్ది స్థలం కలిగి ఉంది. దేశ, విదేశాల్లోని అన్ని ముఖ్యమైన నగరాల్లో అనేక ఆస్తులున్నాయి.