Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: భారతదేశపు యువ క్రికెటర్లు–హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్‌లతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా తమ అతిపెద్ద ప్రచారాన్ని బ్రిటానియా బౌర్బన్ ప్రారంభించింది. ఈ నూతన టీవీసీలో వినోదానికి కేంద్ర బిందువుగా బౌర్బన్ ఉంటుంది. ప్రతిష్టాత్మక చాక్లెటీ స్నాక్ పట్ల ఉన్న కోరికను ఇది వెలుపలికి తీసుకువస్తుంది. ఈ ముగ్గురు క్రికెట్ ఫీల్డ్‌లో మాత్రమే కాదు బయట కూడా స్నేహితులు అని తెలిసిన విషయాన్ని తెలుపుతూనే ప్రతి స్నేహితుల బృందమూ తమను తాము చూసుకునే రీతిలో ఈ టీవీసీ కథనం ఉంటుంది. సరళంగానే అయినప్పటికీ తగినట్లుగా ఉండే పరిజ్ఞానం ఆధారంగా ఈ టీవీసీలో మీ ఆప్తమిత్రులతో సైతం దానిని పంచుకోరాదనే నిర్ణయం మీరు తీసుకునేంతగా అత్యంత రుచికరమైనది బౌర్బన్ అని చూపుతారు. ఈ చిత్రంలో శ్రేయాస్, దీపక్‌లతో బౌర్బన్ చివరి పీస్‌ను పంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా హార్దిక్ కనిపిస్తాడు. కానీ అతను మరో రెండు పీస్‌లను దాచుకుంటాడు అని ఈ టీవీసీలో చూపుతారు.
అసలైన స్నేహం అనే బ్రాండ్ యొక్క ప్రతిపాదనను, ఒరిజినల్ బ్రిటానియా బౌర్బన్ వేడుక చేస్తుంది. అసలైన స్నేహితుల నడుమ ఉండే అల్లరి బంధాన్ని ఇది వేడుక చేస్తూనే, ఈ తరహా స్నేహితుల నడుమ కనిపించే వినోదాన్ని వృద్ధి చేయడంలో బౌర్బన్ పాత్రనూ వెల్లడిస్తుంది. ఈ స్నేహితులు చాలా ప్రత్యేకమైన వారు. అణుకువతో ఉంటూనే వినోదాన్ని ప్రదర్శిస్తుంటారు. అంతేకాదు, ఈ టీవీసీలోని క్రికెటర్లులా అవకాశం వస్తే మాత్రం మీపై విరుచుకుపడే అవకాశాన్ని మాత్రం వదులుకోరు. బౌర్బన్ ఫ్రెండ్స్ ఫరెవర్ ప్రచారం ఆవిష్కరించిన సందర్భంగా వినయ్ సుబ్రమణ్యం, వీపీ– మార్కెటింగ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ మాట్లాడుతూ ‘‘ అసలైన చాక్లెటరీ బిస్కెట్ విందు బ్రిటానియా బౌర్బన్. 1955 నుంచి కూడా ఇది ఇండియాకు ఆనందాన్ని పంచుతూనే ఉంది. గత 65 సంవత్సరాలుగా, బ్రిటానియా బౌర్బన్ను విభిన్న తరాల వారు ఆస్వాదించారు. దాదాపుగా ప్రతి భారతీయ గృహంలోనూ ఇది తరతరాలుగా కనిపిస్తూనే ఉంది. లక్షలాది మంది భారతీయులు బ్రిటానియా బౌర్బన్ను తమ స్నేహితులతో కలిసి ఆస్వాదించారు. అంతేకాదు, భారతీయ యువత కథలు మరీ ముఖ్యంగా తమ స్నేహితులతో పంచుకున్న కథలలో తప్పనిసరి క్యారెక్టర్‌గా ఈ బ్రాండ్ నిలుస్తూనే ఉంది. ఇప్పుడు మా నూతన స్నేహితుల బృందంగా హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్‌ను పరిచయం చేస్తుండటం పట్ల ఆనందంగా ఉన్నాం. వినోదాత్మకంగా, సునిశిత హాస్యంతో బ్రాండ్ ఆలోచనను వీరు ప్రదర్శిస్తున్నారు’’ అని అన్నారు.
సంబిత్ మొహంతీ, హెడ్ ఆఫ్ క్రియేటివ్–సౌత్, మెక్కాన్ వరల్డ్ గ్రూప్ మాట్లాడుతూ ‘‘మీరు మీ స్నేహితులను వేగంగా లాగినప్పుడు అదంతా కూడా చక్కటి వినోదం కోసమే ఉంటుంది, మీకు తెలుసు అసలైన స్నేహంలో అవన్నీ భాగంగానే ఉంటాయని. బ్రిటానియా బౌర్బన్ – ద ఒరిజినల్ బౌర్బన్ నూతన చిత్రంలో ఈ సెంటిమెంట్‌ను ఒడిసిపట్టుకున్నాం. బ్రిటానియా బౌర్బన్ను కేంద్రకంగా ఉంచి అనుచితత్వం, సందర్భరహిత, రహస్యపు పునాదులపై నిర్మించిన స్నేహాన్ని ఇది ప్రదర్శిస్తుంది!’’ అని అన్నారు.