Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద ఉద్యోగ వేదిక మరియు వృద్ధి చెందుతున్న కార్మిక శక్తి కోసం ప్రొఫెషనల్ నెట్వర్క్ గా గుర్తింపు పొందిన apna, దాదాపు 100 మిలియన్ డాలర్ల సిరీస్ సి ఫండింగ్‌ను టైగర్ గ్లోబల్ నేతృత్వంలో సమకూర్చుకుంది. ఈ రౌండ్ ఫండింగ్‌లో ఓవెల్ వెంచర్స్, ఇన్సైట్ పార్టనర్స్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా, మావెరిక్ వెంచర్స్ మరియు జీఎస్వీ వెంచర్స్ కూడా పాల్గొన్నాయి. ఈ రౌండ్‌తో, apna మొత్తం విలువ 1.1 బిలియన్ డాలర్లు వద్ద నిలిచింది. నిరుద్యోగం, దారిద్య్రం, నైపుణ్యాభివృద్ధి వంటి సవాళ్లను పరిష్కరించడాన్ని apna లక్ష్యంగా చేసుకుంది.
గత 15 నెలల కాలంల్చో apna 125రెట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం ప్రతి నెలా 18 మిలియన్ ఇంటర్వ్యూలను ఇది నిర్వహిస్తుంది. apna సీఈవో అండ్ ఫౌండర్ నిమిత్ పారిఖ్ మాట్లాడుతూ ‘‘ ఓ లోతైన సామాజిక కారణం apna కు ఉంది. అవకాశాలను కనుగొనడం , సృష్టించడానికి కట్టుబడి ఉండడంతో పాటుగా నూరుకోట్ల మంది జీవనోపాధిని వృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకుంది. మా భాగస్వాముల నిరంతర మద్దతుతో, మేము ప్రపంచం కోసం పరిష్కారం అనే మా ప్రయాణాన్ని వేగవంతం చేయనున్నాం’’ అని అన్నారు. అతి స్వల్పకాలంలోనే అత్యంత ప్రాధాన్యతా ఎంపికగా ఎంప్లాయర్లు సరైన ప్రతిభావంతులను నియమించుకునేందుకు apna తోడ్పడుతుంది. రెండు సంవత్సరాల లోపుగానే 100 మిలియన్లకు పైగా ఇంటర్వ్యూలను యాప్ ద్వారా నిర్వహించే అవకాశాన్ని apna అందించింది. టైగర్ గ్లోబల్ భాగస్వామి గ్రిఫిన్ ష్రోడర్ మాట్లాడుతూ ‘‘విప్లవాత్మక సామాజిక మరియు ఇంటరాక్టివ్ విధానం చేత నడుపబడుతున్న apna ద్వారా ఎంప్లాయర్లతో ఉద్యోగార్థులు అనుసంధానించబడుతున్నారు’’అని అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఎడ్యుకేషన్ టెక్నాలజీ వెంచర్ క్యాపిటల్ ఓవెల్ వెంచర్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం వల్ల స్కిల్లింగ్ రంగంలో తమ సత్తా చాటాలని ఉవ్విళూరుతున్న apna అంతర్జాతీయ లక్ష్యం సాకారం కానుంది. ఓవెల్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ పటేల్ మాట్లాడుతూ ‘‘నైపుణ్యం కలిగిన ఉద్యోగుల నియామకంలో కంపెనీలు అనుసరించే మార్గాన్ని మరియు నెట్వర్కింగ్ , స్కిల్లింగ్ పరంగా ఈ వ్యక్తులు అనుసరించే విధానాన్ని సమూలంగా మార్చే సామర్థ్యం apna కు ఉందని మేము నమ్ముతున్నాం’’ అని అన్నారు.