Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గూగుల్‌కు చెందిన చెల్లింపుల యాప్ గూగుల్‌పే అనుమతులు లేకుండా ఖాతాదారుల ఆధార్, బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరిస్తోందని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన కోర్టు బుధవారం యుఐడిఎఐ, ఆర్‌బిఐలను స్పందించాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై నవంబర్ 8లోపు వివరణ ఇవ్వాలని గూగుల్ డిజిటల్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. గూగుల్ పే షరతులు, నిబంధనల్లో బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు, ఆధార్ వివరాల సేకరణ నిబంధనలు ఉన్నాయని పిటిషనర్ అయినా ఫైనాన్సీయల్ ఎకనామిస్ట్ అభిజిత్ మిశ్రా ఆరోపించారు. ఇది ఆర్బిఐ అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న వ్యవహారమని పిల్లో పేర్కొన్నారు.