Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గృహ రుణంపై ఎస్బీఐ కీలక నిర్ణయం
- ప్రాసెసింగ్ ఫీజు రద్దు
- గ్రహీతలకు పలు రాయితీలు
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుత పండుగల సీజన్లో ఇండ్లు కొనాలనుకుంటున్న వారిని ఆకర్షించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. వేతనం, వేతనేతర జీవులకు ఇకపై గృహ రుణంపై ఒకే విధమైన వడ్డీ రేటును అమలు చేయాలని నిర్ణయించింది. ఇంతక్రితం వేతనజీవుల కంటే ఉద్యోగేతరుల రుణంపై అదనంగా 15 బేసిస్ పాయింట్ల వడ్డీ వసూలు చేసేవారు. ఇకపై గహ రుణగ్రహీతలకు వత్తి సంబంధిత వడ్డీ ప్రీమియం వసూలు చేయమని ఎస్బీఐ తెలిపింది. తాజా నిర్ణయంతో వేతనం, వేతనం లేని రుణగ్రహీత మధ్య వ్యత్యాసాన్ని ఎస్బీఐ తొలగించినట్లయింది. దీంతో జీతం లేని రుణగ్రహీతలకు ఇది 15 బీపీఎస్‌ల వడ్డీని ఆదా కానుంది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోరు ఆధారంగా జీరో ప్రాసెసింగ్ ఫీజుతో కేవలం 6.70 శాతం వడ్డీ రేటుకే గహ రుణాలను అందిస్తున్నట్లు తెలిపింది.
వారికి రూ.8 లక్షల ఆదా..
గృహ రుణాలపై వడ్డీ రేటును 6.7 శాతానికి తగ్గించింది. అదే విధంగా ఎంత రుణం తీసుకున్నా.. ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది. ఈ తరహా రుణ రేటు బ్యాంకింగ్ పరిశ్రమలనే తొలిసారి. అదే విధంగా ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది. ఇప్పటి వరకూ ఎవరైనా రూ.75 లక్షల గృహ రుణం తీసుకుంటే 7.15 శాతం వడ్డీ కట్టాల్సి వచ్చేది. ఈ తాజా ఆఫర్‌తో ఏకంగా 45 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనివల్ల రూ.75 లక్షల రుణంపై 30 ఏండ్ల వ్యవధిపై రూ.8 లక్షల వరకూ వడ్డీ ఆదా కానుందని ఎస్బీఐ తెలిపింది.
అన్ని వర్గాల వారికి లబ్ది : సిఎస్ సెట్టి
'మా కాబోయే గహ రుణ వినియోగదారుల కోసం పండుగ ఆఫర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉన్నది. ఈసారి, మేం ఆఫర్లను మరింత సమ్మిళితంగా చేసాం. రుణ మొత్తం అనేది రుణగ్రహీత వత్తితో సంబంధం లేకుండా అందిరికి ఒకే విధంగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 6.70 శాతం వడ్డీరేటు, జీరో ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీ వడ్డీ రేట్లు గహ రుణాలను మరింత చౌకగా చేస్తాయని నమ్ముతున్నాం. అందరికీ గహవసతి కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో మా వంతు కషి చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఇన్నాళ్లూ ఎక్కువగా కేవలం బడ్జెట్ ఇండ్లను తీసుకునే వారినే ప్రోత్సహించాం.. తాజా నిర్ణయం ఎలాంటి బడ్జెట్ వారికైనా లబ్ది చేకూర్చనున్నది.' అని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సిఎస్ సెట్టి పేర్కొన్నారు.