Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రపంచంలో అగ్రశ్రేణి ఎడ్టెక్ కంపెనీ బైజూస్ (BYJU’S ) విద్యార్థులు అక్కమోళ్ల సురేందర్ రెడ్డి, రిషి వర్థన్‌లు తెలంగాణా రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తూ పదవ తరగతి బోర్డు పరీక్షలలో 100% మార్కులను సాధించారు. తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ విద్యార్థి అక్కమోళ్ల సురేందర్ రెడ్డి కాగా సికింద్రాబాద్‌లోని సెయింట్ ప్యాట్రిక్స్ హైయర్ సెకండరీ స్కూల్ విద్యార్థి రిషి వర్థన్. వీరిద్దరూ గత నెల తెలంగాణా రాష్ట్ర బోర్డు ప్రకటించిన మెరిట్ లిస్ట్‌లో అత్యున్నత స్ధానాలను అధిరోహించారు. సురేందర్, రిషి ఇద్దరూ కూడా బైజూస్‌పై ఓ సంవత్సర కాలంగా అభ్యసిస్తూ యాప్ యొక్క డిజిటల్ అభ్యాస ఉపకరణాల ద్వారా అభ్యాసాంశాల పట్ల స్పష్టతను సాధించారు.
ఈ విజయం గురించి వినయ్ ఎంఆర్, చీఫ్ కంటెంట్ ఆఫీసర్, బైజూస్ మాట్లాడుతూ ‘‘ బైజూస్ వద్ద ప్రతి ఒక్కరికీ ఇది గర్వకారణమైన సందర్భం. అపూర్వ విజయాన్ని సాధించిన సురేందర్, రిషిలను అభినందిస్తున్నాము. మా వేదిక యొక్క సామర్థ్యానికి వాస్తవ ప్రతీకగా ఈ విద్యార్థులు సాధించిన విజయం నిలుస్తుంది. భవిష్యత్‌లో ఈ ఇరువురూ మరిన్ని మైలు రాళ్లను సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.
బైజూస్ విద్యార్థి అక్కమోళ్ల సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా కుటుంబ సభ్యులు నాకు అపూర్వమైన ప్రోత్సాహం, స్ఫూర్తిని అందించారు. తరగతి అంశాలను సంపూర్ణంగా అర్ధం చేసుకోవడంలో మా టీచర్లు నాకు ఎంతగానో తోడ్పడ్డారు. మా కుటుంబసభ్యులు, మెంటార్లు, టీచర్లు, స్నేహితుల సహకారం వల్లనే ఈ విజయం సాధ్యమైందని నేను బలంగా నమ్ముతున్నాను. నా అభ్యాస భాగస్వామిగా నిలిచిన బైజూస్‌కు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుతున్నాను. నేను మరింతగా అభ్యసించడానికి, చదివిన అంశాలను మననం చేసుకోవడానికి బైజూస్ నాకు ఎంతగానో సహాయపడింది. అపరిమిత ప్రాక్టీస్ పరీక్షలు, బహుళ పునశ్చరణలు ఈ పరీక్షలకు సిద్ధ కావడంలో తోడ్పడ్డాయి’’అని అన్నారు.
బైజూస్ విద్యార్థి రిషి వర్ధన్ మాట్లాడుతూ ‘‘నేను సాధించిన ఫలితాల పట్ల నాతో పాటుగా నా కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా భావిస్తున్నారు. నా శక్తి సామర్థ్యంల పట్ల అపరిమిత నమ్మకం చూపుతూ, బైజూస్ లో నన్ను చేర్చిన తల్లిదండ్రులు ఉండటం నా అదృష్టం. నా మెంటార్ల మద్దతు కారణంగానే నేను పరీక్షలకు పూర్తి ఆత్మవిశ్వాసంతో వెళ్లాను. బైజూస్ యొక్క అనుసంధానిత వీడియో పాఠాలు, ఇంటరాక్టివ్ ప్రత్యక్ష తరగతులు వంటివి అభ్యాసకునిగా నా సామర్థ్యం పట్ల నమ్మకం కలిగించడంలో సహాయపడ్డాయి’’ అని అన్నారు.