Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే తన వ్యాపార భాగస్వాముల కోసం సరికొత్త పోటీ పెడుతోన్నట్లు తెలిపింది. తమ క్యూఆర్‌లో చేసిన లావాదేవీల సంఖ్య, విలువ ఆధారంగా ప్రపంచ క్రికెట్ కప్ పోటీలను ఉచితంగా చూసే అవకాశాన్ని కలిపిస్తున్నట్టు పేర్కొంది. 'భారత్‌పే లగావో, వరల్డ్ కప్ జావో' పేరుతో నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్‌లో టి20 వరల్డ్ కప్ 2021లో భారత్ ఆడే మ్యాచ్‌లు చేసేందుకు దుబాయికి రెండు రోజులు ఉచితంగా వెళ్లి రావొచ్చని తెలిపింది. దేశ వ్యాప్తంగా 400 మంది అగ్రశ్రేణీ వ్యాపారులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.