Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని మథుర కోసి కలాన్లో రూ.814 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు పెప్సికో తెలిపింది. దేశంలోనే తమ ఈ అతిపెద్ద గ్రీన్పీల్డ్ కర్మాగారంలో 30 శాతం మహిళ ఉద్యోగులకు అవకాశం కల్పిస్తోన్నట్లు పేర్కొంది. 29 ఎకరాల్లో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఐదు వేల మంది రైతుల నుంచి ఏడాదికి లక్షన్నర టన్నుల బంగాళాదుంపలు తీసుకోనున్నట్టు పేర్కొంది.