Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తన ప్రధాన రివార్డ్స్ 123 పొదుపు ఖాతాను ప్రారంభించిన తరువాత, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నేడు రివార్డ్స్ 123 ప్లస్ డిజిటల్ పొదుపు ఖాతా వేరియంట్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వివిధ రకాల డిజిటల్ లావాదేవీలపై, హామీతో కూడిన ప్రయోజనాలతో పాటు, ఇది ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ని కూడా అందిస్తుంది. Airtel Thanks app లోని బ్యాంకింగ్ విభాగం ద్వారా వినియోగదారులుతమ ఖాతాలను డిజిటల్ విధానంలో ప్రారంభించుకోవచ్చు లేదా రివార్డ్స్ 123 ప్లస్‌కి అప్‌గ్రేడ్ కావచ్చు. ఈ ప్రక్రియ చాలా సులభం మరియు దేశంలో ఎక్కడి నుంచైనా నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. వాలెట్ వినియోగించుకునే వారు కూడా ఇప్పుడు రివార్డ్స్ 123 ప్లస్ ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.
వినియోగదారుడు రివార్డ్స్ 123 ప్లస్‌ను వార్షిక రుసుము కేవలం రూ.499లో పొందవచ్చు మరియు ఒక ఏడాది పాటు పాటు అనేక ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు:
- డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ - 1ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ (రూ.499 విలువ)
- లోడ్ మనీ బెనిఫిట్–యుపిఐ ద్వారా నగదు జమ చేసినప్పుడు నెలకు ఒకసారి రూ.10 క్యాష్ బ్యాక్ పొందవచ్చు (కనీస లావాదేవీ మొత్తం రూ.1,000)
- చెల్లింపు ప్రయోజనాలు - మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు, మొబైల్ పోస్ట్ –పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ మరియు డిటిహెచ్ బిల్లు చెల్లింపులపై నెలకు ఒకసారి రూ.30 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. (కనీస చెల్లింపు మొత్తం రూ.225)
రివార్డ్స్ 123 ప్లస్ సేవింగ్స్ ఖాతా వినియోగదారులు రూ.1లక్ష-రూ.2 లక్షల డిపాజిట్లపై 6% వడ్డీని కూడా పొందుతారు, జీరో మినిమమ్ బ్యాలెన్స్, మరియు ఆటో-స్వీప్ సదుపాయంతో అపరిమిత డిపాజిట్లను చేసేందుకు అవకాశం ఉంటుంది.
వినియోగదారులు కస్టమర్ రివార్డ్స్ 123 ప్లస్ ఖాతా ప్రారంభించిన లేదా అప్‌గ్రేడ్ చేసిన అనంతరం వారు డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్సైట్ (https://www.hotstar.com/in) లేదా యాప్‌కి లాగిన్ అయి సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో, వినియోగదారులు డిస్నీ+ హాట్స్టార్లోఎనిమిది భాషల విస్తృత స్థాయిఅంతర్జాతీయ మరియు స్థానిక కంటెంట్లైబ్రరీని, అతిపెద్ద క్రీడా టోర్నమెంట్లతో సహా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్ 2021, లైవ్ స్ట్రీమ్‌లను వీక్షించవచ్చు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గణేష్ అనంతనారాయణన్ మాట్లాడుతూ, ‘‘డిజిటల్ లావాదేవీలపై రివార్డ్స్ 123 వినియోగదారులకు నెలవారీ ప్రయోజనాల భరోసా ఇవ్వాలనే మా నిబద్ధతతో, వారి వినోద అవసరాలను కూడా పరిష్కరించగలిగిన రివార్డ్స్ 123 ప్లస్‌ని ప్రవేశపెట్టాము. మా వినియోగదారులకు సబ్స్క్రిప్షన్ ప్రయోజనాన్ని అందించేందుకు డిస్నీ+ హాట్‌స్టార్‌తో కుదుర్చుకున్న భాగస్వామ్యం మాకు సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మా రివార్డ్స్ 123 ఆఫరింగ్‌కు మరిన్ని ప్రయోజనాలను జోడించాలని మేము ప్రణాళిక రూపొందించుకుంటున్నాము’’ అని వివరించారు.