Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: దేశంలో నం.1 స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ టీవీ బ్రాండ్ షవోమి నేడు భారతదేశంలో 100+ షవోమి రిటెయిల్ స్టోర్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో అత్యంత పెద్ద ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ రిటెయిల్ నెట్‌వర్క్‌గా కొనసాగుతున్న షవోమి దేశంలో తన అడుగుజాడలను విస్తరిస్తుండగా, ఈ స్టోర్లను టైయర్ 5, టైయర్ 6 మార్కెట్లలో అందుబాటులోకి తీసుకు వస్తోంది. దీనితో షవోమి ఇండియా కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రముఖ ఉనికిని కలిగి ఉన్న సంస్థగా నిలువనుంది. అక్కడి నుంచి గ్రామీణ మార్కెట్లలో రిటెయిల్ లావాదేవీల డైనమిక్స్ మార్చనుంది. వినియోగదారులకు పండుగ ఉత్సామాన్ని తీసుకు రానుంది.
షవోమి ఇండియా నిరంతరం దేశానికి తన నిబద్ధతను చూపించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. దీనికి అనుగునంగా ఈ బ్రాండ్ 100+ కొత్త రిటెయిల్ స్టోర్లు టైయర్-5 మరియు టైయర్-6 నగరాల్లో ఏర్పాటు చేస్తుండగా, అక్కడి జనాభా 50 వేల కన్నా తక్కువగా ఉంది. దేశంలోని కుగ్రామాలకు తమ పరికరాలను చేర్చేందుకు కట్టుబడి, సాంకేతికత అందరికీ లభించేలా చేయడం ద్వారా వనియోగదారుల అవసరాలను పరిష్కరించే దిశలో కంపెనీ 200+ కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టించడం ద్వారా భారతదేశ వ్యాప్తంగా వ్యాపార దక్షతను ఉత్తేజిస్తుంది. ఈ మైలురాయి గురించి షవోమి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణన్.బి మాట్లాడుతూ, ‘మేము గ్రో విత్ ఎంఐ ఇనీషియేటివ్‌ను 6 నెలల క్రితం ప్రారంభించాము. దేశ వ్యాప్తంగా రిటెయిల్ భాగస్వాముల నుంచి అందుకున్న అపారమైన ప్రతిస్పందన మరియు మద్ధతు చాలా సంతోషాన్ని కలిగించింది. నేడు మా నెట్వర్కును 100+ కొత్త స్టోర్లతో మరింత బలోపేతం చేసుకునేలా ఉత్తేజించింది. దీని ద్వారా మా లక్ష్యం టైయర్ 5, టైయర్ 6 నగరాల్లో షవోమి మరియు రెడ్మి ఉత్పత్తుల లభ్యతను ఎక్కువ చేయాలని, పరిమితంగా మా ఉత్పత్తులు అందుబాటులో ఉన్న ఈ ప్రదేశాల్లో అత్యుత్తమ అనుభవాన్ని అందించాలని కోరుకుంటున్నాము. మా రిటెయిల్ స్టోర్లు కొత్తగా వ్యాపారరంగంలో అడుగు పెట్టిన వారి కలలు నెరవేర్చుకునేందుకు ఒక అడుగు దగ్గరకు తీసుకు వెళుతుంది మరియు దేశంలోని ప్రతి ప్రాంతంలో ఉద్యోగాన్ని సృష్టిస్తుందన్న విశ్వాసం మాకు ఉంది’’ అని తెలిపారు.
తన ఆఫ్‌లైన్ ప్రయాణాన్ని ప్రారంభించిన షవోమి ఇండియా తన మొదటి ఫ్లాగ్షిప్ రిటెయిల్ స్టోర్లను ఆగస్టు 15, 2018లో బెంగళూరులో ప్రారంభించింది. కేవలం 2 ఏళ్లలోనే 3,000+ ఆఫ్‌లైన్ రిటెయిల్ స్టోర్లకు చేర్చడం ద్వారా భారతదేశవ్యాప్తంగా 6,000 మందికి ఉద్యోగాన్ని సృష్టించింది. మార్చి 2021లో తన గ్రో విత్ ఎంఐ కార్యక్రమంతో కంపెనీ భారతదేశంలో ఆఫ్‌లైన్ రిటెయిల్ టచ్ పాయింట్లు అలాగే ఎక్స్‌క్లూజివ్ రిటెయిల్ స్టోర్లను రెట్టింపు చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది. అంతే కాకుండా కంపెనీ రానున్న 2 ఏళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడితో 6,000 స్టోర్లను ప్రారంభించేందుకు కట్టుబడి ఉండగా, ఇది ప్రతి ఒక్కరికీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకు రావాలన్న లక్ష్యంతోనే ఈ తీర్మానాన్ని తీసుకుంది.
దేశంలోని కుగ్రామాలకు తన పరికరాలను చేర్చేందుకు షవోమి ఇండియా కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 12 కొత్త స్టోర్లను దేశంలోని తూర్పు ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతంలో 26, ఉత్తరంలో 29, దక్షిణంలో 33 స్టోర్లను ప్రారంభించనుంది. షవోమి ఇండియా వరుసగా 16 త్రైమాసికాల నుంచి #1స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఉంది. ప్రస్తుతం 75+ ఎంఐ హోమ్స్, 75+ ఎంఐ స్టూడియోస్, 9,400+ ఎంఐ ప్రిఫర్డ్ పార్ట్నర్స్ 4,000+ లార్జ్ ఫార్మాట్ రిటెయిల్ భాగస్వాములను 3,000+ ఎంఐ స్టోర్లను కలిగి ఉంది. ఈ బ్రాండ్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ హద్దులను నివారించే తన మొదటి ఆమ్ని-ఛానెల్ పరిష్కరణ-ఎంఐ కామర్స్‌ను నిరుడు మహమ్మారి సమయంలో ప్రారంభించింది.