Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : విఇ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ (విఇసివి)లో భాగమైన వోల్వో ట్రక్స్ ఇండియా భారత్లో ఎఫ్ఎం, ఎఫ్ఎంఎక్స్ శ్రేణిలో 6 హెవీ డ్యూటీ ట్రక్కులను విడుదల చేసింది. దేశంలో సురక్షితమైన ట్రక్కులకు వద్ధి చెందుతున్న డిమాండ్లకు అనుగుణంగా వీటిని తయారు చేసినట్లు ఆ కంపెనీ తెలిపింది. ''మా వినియోగదారులకు అధిక పనితీరు సామర్థ్యాన్ని అందించేందుకు డిజైన్ చేసిన ఈ కొత్త తరం ట్రక్కులను గర్వంగా విడుదల చేస్తున్నాము. మేము ప్రపంచ స్థాయి ఆవిష్కరణలను భారత్కు తీసుకురావడాన్ని కొనసాగిస్తున్నాము. ఈ ట్రక్కులను మా వినియోగదారులు అత్యంత ఇష్టపడే వ్యాపార భాగస్వామిగా మా పాత్రను మరింత బలోపేతం చేస్తాయి'' అని విఇ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ అగర్వాల్ తెలిపారు.