Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ప్రముఖ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టివి బ్రాండ్ షవోమి దేశంలో కొత్తగా 100 రిటైల్ స్టోర్లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. వీటిని చిన్న పట్టణాల్లో అందుబాటులోకి తీసుకు వస్తోన్నట్లు తెలిపింది. ఆరు నెలల క్రితం ఈ విస్తరణ కార్యక్రమం చేపట్టామని షవోమి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణన్ బి పేర్కొన్నారు. 2018లో బెంగళూరులో తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. రెండేళ్లలో 3,000 స్టోర్లను ఏర్పాటు చేసింది. రానున్న రెండేండ్లలో రూ.100 కోట్ల పెట్టుబడితో 6,000 స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.