Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెజారిటీ వాటా కలిగిన ఐడీబీఐ బ్యాంకు విక్రయ ప్రక్రియకు మర్చంట్ బ్యాంకర్లు ఏడాది గడువును కోరినట్టు సమాచారం. ఈ సంస్థలో వాటాల విక్రయానికి, యాజమాన్య మార్పునకు గత మే నెలలో కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయగా.. విక్రయ వ్యవహారాన్ని నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి దీపమ్ జులై 13 నాటికి బిడ్స్‌ను అహ్వానించింది. ఆరు నెలల్లోగా ఈ సంస్థను ప్రయివేటీకరించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నది. కాగా.. పోటీలోని ఏడు మర్చంట్ బ్యాంకర్లు డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ పూర్తి చేయడానికి 52 వారాల గడవు కోరినట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.