Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 525 పాయింట్ల పతనం
ముంబయి : అమ్మకాల ఒత్తిడితో సోమవారం భారత మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు గరిష్ఠ స్థాయి వద్ద ఉన్న నేపథ్యంలో లోహ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో తుదకు బిఎస్ఇ సెన్సెక్స్ 524.96 పాయింట్లు లేదా 0.89 శాతం పతనమై 58,490.93కు పడిపోయింది. దీంతో ఒక్క పూటలోనే మదుపర్లు రూ.3.78 లక్షల కోట్ల విలువ నష్టపోయారు. బిఎస్ఇ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.255.18 లక్షల కోట్లకు తగ్గింది. ప్రతీ నిమిషానికి మదుపర్లు రూ.1000 కోట్లు నష్టపోయారని అంచనా. ఎఫ్ఎంసిజి మినహా మిగితా రంగాలన్నీ రెండు శాతం వరకు విలువ కోల్పోయాయి.
బిఎస్ఇ బాటలోనే ఎన్ఎస్ఇ నిఫ్టీ 188.30 పాయింట్లు లేదా 1.07 శాతం కోల్పోయి 17,396.90 వద్ద ముగిసింది. 995 షేర్లు లాభాల్లో సాగగా.. 2308 షేర్లు నష్టాలను చవి చూశాయి. నిఫ్టీలో టాటా స్టీల్, జెఎస్డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండిస్టీస్, ఎస్బిఐ షేర్లు అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్లో ఉండగా.. హెచ్యుఎల్, ఐటిసి, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, బ్రిటానియా ఇండిస్టీస్ సూచీలు అధిక లాభాలు నమోదు చేసిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.