Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్న వ్యాపారాలు, వర్తకులకు పరిష్కరణలు
ముంబయి: భారతదేశంలో అగ్రగామి వినియోగదారుల మరియు వ్యాపారుల (1) డిజిటల్ ఎకోసిస్టమ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పేటీఎం నేడు విసాతో సిద్ధంగా ఉన్న క్రెడిట్ కార్డుల సమగ్ర శ్రేణిని విడుదల చేసే పథకాలను ప్రకటించింది. తన వినూత్న తరహా భాగస్వామ్యం వినియోగదారుల వలయంలో అత్యంత విస్తృత శ్రేణి ఆఫర్లను అందించే ఉద్దేశాన్ని కలిగి ఉండగా, అందులో మినేలియల్స్, వ్యాపారాల యజమానులు, వ్యాపారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రెడిట్ కార్డులను రిటెయిల్ వినియోగదారుల ప్రత్యేక అవసరాలకు తగినట్టు కస్టమైజ్ చేసేందుకు అవకాశం ఉండగా, కొత్త క్రెడిట్ వినియోగదారుల నుంచి ఇప్పటికే క్రెడిట్ కార్డులను విస్తృతంగా వినియోగించే వారి వరకు ఈ వర్గంలో అత్యుత్తమ రివార్డ్స్ క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులకు అందిస్తుంది. కొత్త కార్డులు చిన్న వ్యాపారాలను నిర్వహించే యజమానులకూ సౌలభ్యాన్ని అందించనున్నాయి.
వీటి విడుదలను అక్టోబరు 2021లో పండుగ సీజన్‌కు నిర్ణయించగా, క్రెడిట్ కార్డు ఆఫర్లు, ఇఎంఐలు, బై నౌ పే లేటర్ ఎంపికలకు ఎక్కువ మంది వినియోగదారుల డిమాండ్ల నేపథ్యంలో డిసెంబరు 2021 చివరి వరకు సంపూర్ణ ఉత్పత్తుల శ్రేణిని అందించనుంది. సంస్థ 5.1 కోట్ల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మరియు ప్రీపెయిడ్ కార్డులు అలాగే 2 మిలియన్లకు పైగా ఎక్కువ వ్యాపారులను కలిగి ఉండగా, ప్రతి మార్కెట్ వర్గానికీ ఇది సేవలను అందిస్తోంది. భారతదేశంలో ఖర్చు చేసే ప్రతి మూడో రూపాయి హెచ్‌డిఎఫ్‌సి కార్డుల ద్వారా జరుగుతోంది. బ్యాంకు భారతదేశంలో కొనుగోలు చేసే గాథను విస్తరించడంలో పలు ఏళ్ల నుంచి గమనార్హమైన పాత్రను పోషించింది. ఈ భాగస్వామ్యం పరస్పర సామర్థ్యాన్ని వినియోగించుకోవడం ద్వారా వినియోగదారులకు ఉన్నత విలువలు, అనుభవాన్ని అందించే ఉద్దేశాన్ని కలిగి ఉంది: భారతదేశంలో అగ్రగామి క్రెడిట్ కార్డులను అందించే సంస్థగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ప్రాధాన్యత మరియు ఉన్నత వినియోగదారుల క్రియాశీలతను అందించే శక్తి, పేటీఎంకు ఉన్న డిజిటల్ పరిణితి అలాగే 330 మిలియన్ వినియోగదారుల పరిధి. (2) ఈ భాగస్వామ్యం టైయర్ 2, టైయర్ 3 మార్కెట్లలో లోతైన విస్తరణ లక్ష్యాన్ని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా డిజిటైజ్డ్ చెల్లింపులకు వేగవంతమైన విస్తరణను సాధ్యం చేస్తోంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పేటీఎం బిజినెస్ క్రెడిట్ కార్డులను పరిచయం చేస్తుండగా, అందులో భారతదేశంలోని చిన్న నగరాలు, పట్టణాల్లో వ్యాపార భాగస్వాములకు పలు అనుకూలతలను అందిస్తుంది. వారికి తక్షణమే రుణం లభించేలా, కాగిత రహిత ఆమోదం లభించేలా చేస్తుంది. ఈ బిజినెస్ క్రెడిట్ కార్డులు వ్యాపారులకు పేటీఎం క్రెడిట్ కార్డు వలయాలని ప్రవేశాన్ని అందిస్తుండగా, 21 మిలియన్లకు పైగా వ్యాపారుల పేటీఎం పరిధికి అనుకూలం కానుంది (2). వారు పూర్తి శ్రేణి వినియోగదారుల క్రెడిట్ కార్డులను కూడా పరిచయం చేస్తుండగా, క్యాష్‌బ్యాక్‌లు, అనుకూలతను అందిస్తుండగా, అందులో మొబైల్ క్రెడిట్ కార్డును డిజిటల్-ఫస్ట్ మిలేనియల్స్కు అందించనున్నారు. వినియోగదారులు డిజిటల్, కాగిత రహిత ప్రక్రియల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పేటీఎం యాప్ ద్వారా ఆన్-బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
పేటీఎం లెండింగ్ విభాగం సీఈఓ భవేశ్ గుప్త మాట్లాడుతూ ‘‘పేటీఎంలో మేము 300 మిలియన్లకుపైగా వినియోగదారులు, 21 మిలియన్లకు పైగా వ్యాపార భాగస్వాములకు రుణ లభ్యతను సరళం చేసే ఉద్దేశ్యాన్ని కలిగి ఉండగా, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను ముందుకు తీసుకు వెళుతుంది (2). మా సాంకేతిక సామర్థ్యాలతో పేటీఎంలో వ్యాపార భాగస్వాములు, భారతదేశంలో రుణాలకు కొత్తవారైన మిలినియల్స్ ఇప్పుడు ఆరోగ్యవంతమైన క్రెడిట్ ప్రొఫైల్ నిర్మించుకోవచ్చు. ఫార్మల్ ఆర్థిక వ్యవస్థలో అందుబాటలో ఉన్న అవకాశాలను లభ్యతను అందుకుంటారు. అన్ని వినియోగదారుల వయాల్లో సమగ్రతతో కూడిన క్రెడిట్ కార్డుల సమగ్ర సూట్‌ను ప్రారంభించేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, వీసా భాగస్వామ్యం మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మా బిజినెస్ క్రెడిట్ కార్డులను మా వ్యాపార భాగస్వాములను చక్కగా అర్థం చేసుకున్న పునాదులపై డిజైన్ చేశాము. ఈ ఆఫర్లను వాస్తవానికి వారి వ్యాపారులకు అనుకూలతను కల్పిస్తాయి అని విశ్వసిస్తున్నాము’’ అని వివరించారు.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పేమెంట్స్, కన్సూమర్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఐటి గ్రూప్ హెడ్ పరాగ్ రావు మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో అత్యంత పెద్ద కార్డు వితరణ అలాగే స్వాధీన బ్యాంకుగా మేము దేశంలో డిజిటైజేషన్‌ను వృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాము. భారతదేశపు ప్రగతి కథను మేము విశ్వసిస్తాము. ఈ భాగస్వామ్యం ఈ పండుగ సందర్భంలో కొనుగోలుకు సన్నద్ధం చేసే బ్యాంకు ప్రయత్నాల్లో భాగం కాగా, అది దేశ ఆర్థిక ప్రగతికి మరింత ఉత్తేజాన్ని అందించనుంది. కార్డుల రంగంలో ముందంజలో ఉండగా, మా ఉద్దేశం అటువంటి భాగస్వామ్యాల ద్వారా ఎకో-సిస్టమ్ విస్తరించేందుకు మద్ధతు అందించడం ద్వారా అది వినియోగదారులకు అంతిమంగా, విభిన్నమైన అనుభవాన్ని అందిస్తుంది’’ అని తెలిపారు.
భారతదేశం, దక్షిణ ఆసియా గ్రూప్ కంట్రీ మేనేజర్ టి.ఆర్.రామచంద్రన్ మాట్లాడుతూ, ‘‘వినియోగదారులు, వ్యాపారాలు సమానంగా నేడు డిజిటల్ చెల్లింపులను వినియోగించుకుంటున్నాయి. మేము పేటీఎం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో భాగస్వామ్యానికి, పూర్తి స్థాయి వీసా పరిష్కరణలు మరియు సామర్థ్యతలను జారీ చేసేందుకు గర్వపడుతున్నాము. వారు విస్తృతమైన, వైవిధ్యమయ వినియోగదారులకు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందిస్తున్నారు. కొత్త వారితో డిజిటల్ పరిణితమైన మరియు చిన్న వ్యాపారులను కలిగిన ప్రతి రకం వినియోగదారుల అవసరాలను పరిష్కరించే కార్డులను డిజైన్ చేయడంతో మేము వారి రుణ సన్నద్ధత మరియు లభ్యత ఈ భాగస్వామ్యంతో సాధ్యమవుతుందన్న విశ్వాసాన్ని అందిస్తుంది’’ అని తెలిపారు.