Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 24న ఆరోపణలు నమోదు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో అల్లకల్లోలం సృష్టించిన 'ముజఫర్నగర్ అల్లర్ల ఘటన'లో నిందితులపై ఈనెల 24న ఆరోపణలు నమోదు చేయనున్నామని న్యాయస్థానం తెలిపింది. ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి సయీద్ ఉజామా, మాజీ ఎంపీ కదీర్రానా, మాజీ ఎమ్మెల్యే మౌలానా జమీల్, మరో ఏడుగురు వ్యక్తులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరంతా 2013లో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పోలీసులు ఆరోపణలు నమోదుచేశారు. వీరి ప్రసంగాల వల్లే ముజఫర్ నగర్లో అల్లర్లు చెలరేగాయని కోర్టుకు తెలియజేశారు.