Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెలాయిట్ సీఈఓ వెల్లడి
వాషింగ్టన్ : భారత్లో పెట్టుబడులు పెట్టడానికి అగ్ర దేశాల ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని డెలాయిట్ సీఈఓ పునీత్ రంజన్ పేర్కొన్నారు. తమ సంస్థ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 1,200 మంది వ్యాపార దిగ్గజాల్లో అయిదింట రెండొంతుల మంది కూడా భారత్లో అదనంగా పెట్టుబడులు పెట్టడం లేదా తొలిసారిగా ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తి కనపర్చారన్నారు. దేశం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ఎఫ్డీఐలు కీలకమన్నారు. బ్రిటన్, అమెరికా, జపాన్, సింగపూర్ తదితర దేశాల్లోని ఇన్వెస్టర్లు భారత్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నారన్నారు. కాగా.. భారత్లో వ్యాపారం చేయడమంటే సవాళ్లతో కూడుకున్న వ్యవహారమనే అభిప్రాయం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు.