Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న నిరుద్యోగం.. ఎంఎస్ఎంఈలే కీలకం
ముంబయి : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని పెంపొందించడంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకమని జీనియస్ కన్సల్టెంట్స్ సర్వేలో తేలింది. కరోనా సంక్షోభం నుంచి ఈ సంస్థలు కోలుకోవాల్సి ఉన్నదని 57 శాతం కంపెనీలు అభిప్రాయపడినట్టు తెలిపింది. 'గ్రామీణ నిరుద్యోగం ఒక్కసారిగా ఎందుకు పెరిగింది?' అనే అంశంపై జీనియస్ కన్సల్టెంట్స్ ఓ సర్వే నిర్వహించింది. గడిచిన ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 10 మధ్య 1,100 కంపెనీ యాజమాన్యల అభిప్రాయాలను సేకరించింది. కరోనాతో ఎంఎస్ఎంఈ రంగం ఎక్కువ ప్రతికూలతకు గురైందని ఈ రిపొర్ట్ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెద్దగా లేకపోవడమే నిరుద్యోగం పెరిగేందుకు కారణమని ఈ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది.