Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీఎన్‌పీఎల్ పిన్‌టెక్ స్టార్టప్ పేటెయిల్ సీడ్ రౌండ్లో నిధులు సమీకరించినట్లు తెలిపింది. చోలమండలం, ఇతర మార్క్యూ ఏంజెల్ పెట్టుబడిదారుల నుండి 1.5 మిలియన్ డాలర్ల (రూ.11.07 కోట్లు)ను సేకరించినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నిధులు అవాంతర రహిత కస్టమర్ అనుభవాన్ని అందించడానికి, వ్యాపారి వైపు విక్రయాలను మెరుగుపరచడానికి దోహదం చేస్తాయని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. రాబోయే 12 నెలల్లో నెలవారీ లావాదేవీలలో 10 శాతం-15 శాతం వద్ధి రేటును సాధించడానికి పేటెయిల్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలిపింది.