Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2021-22లో 10 శాతమే
న్యూఢిల్లీ : భారత వృద్థి రేటు అంచనాలకు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) కోత పెట్టింది. 2021-22లో భారత జీడీపీ పెరుగుదల 10 శాతానికి పరిమితం కావొచ్చని తాజా రిపోర్ట్‌లో పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 11 శాతంగా వేసింది. దేశంలో ఇంధన ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 5.5 శాతానికి ఎగిసే అవకాశం ఉందని తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 5.2 శాతంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ అనుకున్న దానికంటే కొంత నెమ్మదించిందని తెలిపింది. 2022-23లో దేశ జీడీపీ 7.3 శాతం పెరగొచ్చని తెలిపింది. కరోనా పరిణామాలు ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడికి గురి చేస్తున్నాయని ఏడీబీ ప్రతినిధి అబ్దుల్ అబీద్ పేర్కొన్నారు.