Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ మీడియా సంస్థలు జీ ఎంటర్టైన్మెంట్, 'సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా(ఎస్పీఎన్ఐ) మధ్య విలీన ఒప్పందం కుదిరింది. ఈ ప్రక్రియ తర్వాత ఏర్పాడే సంస్థలో జీకి 47.07 శాతం, సోనీకి 52.93 శాతం వాటాలు దక్కనున్నాయి. దీనికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విలీనం తర్వాత సోనీ పిక్చర్స్ 1.575 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11వేల కోట్లు) పెట్టుబడులను పెట్టనుంది. పస్తుతం జీ సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకా విలీన సంస్థకు ఐదేండ్ల పాటు ఎండీ, సీఈఓ గా కొనసాగనున్నారు.