Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ సంస్ధ మౌరి టెక్ వెల్లడి
హైదరాబాద్ : అంతర్జాతీయ ఐటీ పరిష్కారాల సంస్థ మౌరి టెక్ భారత్లో వచ్చే మూడేండ్లలో కొత్తగా 10వేల మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు తెలిపింది. తొలి దశలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లోనే రెండు వేల మందిని నియమించుకోనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్లోని తమ కార్యాలయంలోనే 3000 మందికి పైగా ఉద్యోగులకు అవకాశాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. దీర్ఘకాలంలో తమ వ్యాపారావకాశాలు గణనీయంగా వద్ధి చెందనున్నాయనే అంచనాల మధ్య అదనపు సామర్థ్యపు అవసరాలకు అనుగుణంగా ఈ నియామకాలు జరుగనున్నాయని తెలిపింది.