Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.2 కోట్లు పైనే
న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి భారత మార్కెట్లోకి ఇ-ట్రాన్ జిటి, అర్ఎస్ ఇ-ట్రాన్ జిటి కూపే సెడాన్‌ను విడుదల చేసింది. ఇ-ట్రాన్ జిటి, ఆర్ఎస్ మోడల్‌ను పోర్షే తొలి ఎలక్ట్రిక్ కారు సాంకేతిక జోడింపుతో దీన్ని అభివృద్థి చేసింది. ఇక ఇ-ట్రాన్ జిటి కారు ధరను రూ. 1.8 కోట్లుగా నిర్ణయించింది. ఆర్ఎస్ ఇ-ట్రాన్ జిటి కూపే ధర రూ 2.05 కోట్లుగా పేర్కొంది. వైర్లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, ఫ్రంట్, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ట్రాక్షన్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరాతో కూడిన పార్కింగ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్లు దీని సొంతమని తెలిపింది. స్టాండర్డ్ మోడల్‌కు భిన్నంగా ఆర్ఎస్ ఇ-ట్రాన్ జిటి మెరుగైన సామర్ధ్యం కోసం కార్బన్ ఫైబర్ రూఫ్‌ను కలిగి ఉందని ఆ కంపెనీ తెలిపింది.