Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 శాతం వాటా కేటాయింపు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్లో కేంద్ర ప్రభుత్వం విదేశీ సంస్థాగత మదుపర్లకు 20 శాతం వాటా కొనుగోలుకు అవకాశం ఇవ్వనుందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బుధవారం ఓ ఉన్నతాధికారి తెలిపారని రాయిటర్స్ పేర్కొంది. ఈ మెగా ఐపీఓ ద్వారా మోడీ ప్రభుత్వం రూ.90వేల కోట్ల విలువ చేసే ఎల్ఐసీ వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయివేటు బీమా కంపెనీల్లో 74 శాతం, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఇప్పటి వరకు 20 శాతం వాటా కొనుగోలుకు విదేశీ పెట్టుబడిదారులకు పరిమితి ఉంది. కాగా ఎల్ఐసీ చట్టంలో విదేశీ పెట్టుబడిదారులకు అవకాశం లేదు. దీన్ని మార్చనున్నారని తెలుస్తోంది. ఈ ఐపీఓలో చైనా ఇన్వెస్టర్లను నిషేధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని సమాచారం. మరో ఐదేళ్లలో ఇంత పెద్ద ఐపీఓ రాకపోవచ్చని ఓ మర్చంట్ బ్యాంకర్ తెలిపారు. ఈ ఐపీఓ కోసం ఎస్బీఐ కాపిటల్ మార్కెట్, జెఎం ఫైనాన్సీయల్, యాక్సిస్ కాపిటల్, బీఓఎఫ్ఎ సెక్యూరిటీస్, జెపి మోర్గాన్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కొటాక్ మహీంద్రా కాపిటల్ తదితర సంస్థలను లీడ్ మేనేజర్లు, సలహాదారులుగా దీపమ్ నియమించింది.